ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇక మీదట ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షను కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటి నుంచి మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ జనవరి 6న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.


దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షలోనూ రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేసింది. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్షలో 150మార్కులకు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉండగా.. మెయిన్స్‌లో 450 మార్కులకు 3పేపర్లకు బదులు ఇక నుంచి 300 మార్కులకు రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేసింది.


ఏపీపీఎస్సీ గ్రూప్-1 పేపర్-1లో ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు ఈ ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత ఆర్ధిక వ్యవస్ధ, ఏపీ ఆర్ధిక వ్యవస్ధ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నాపత్రం ఉండబోతోంది.


గ్రూపు-2 సిలబస్, పరీక్ష పేపర్లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిప్రకారం ఇకపై స్క్రీనింగ్ టెస్టును 150, మెయిన్ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్టును 150, ప్రధాన పరీక్షను మూడు పేపర్లతో నిర్వహించారు. మొత్తం 450 మార్కులు ఉండేవి.


ఆర్థికశాఖ జనవరి 6న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. పరీక్ష, సబ్జెక్టులు, మార్కుల వివరాలిలు ఇలా:


స్క్రీనింగ్ టెస్ట్: 


జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ - 150 మార్కులు


మెయిన్స్ పరీక్ష:

పేపరు-1:
ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం - 150 మార్కులు

పేపరు-2:
ఆంధ్రప్రదేశ్, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్&టెక్నాలజీ- 150 మార్కులు


Also Read:


APPSC: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
గ్రూప్-2 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!
'గ్రూప్-1' ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్ తెలిపింది. గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 6న అధికారిక ప్రకటన విడుదల చేసింది. మారిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 2018 నోటిఫికేషన్ అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనందున మిగిలిన 17 పోస్టులకు, భర్తీకాని మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిపికేషన్‌కు కలిపినట్లు వెల్లడించింది.
గ్రూప్-1 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


6100 కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి.
కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...