APPSC Group 2 Results: అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను (ఫైనల్ సెలెక్షన్ లిస్ట్) మంగళవారం అర్ధరాత్రి తరువాత ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ అభ్యర్థుల వివరాలను కమిషన్ వెల్లడించింది. అయితే, క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన కారణంగా, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థుల కోరిక మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్‌ఓ పోస్టులను ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచారు.

Continues below advertisement

ఏపీ గ్రూప్ 2 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ప్రకటించిన 891 పోస్టులలో హైకోర్టు తీర్పును అనుసరించి, హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మరో 25 పోస్టుల ఎంపికలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మిగిలిన 866 పోస్టుల ఎంపికలో ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా ప్రకటించని 14 పోస్టుల విషయానికి వస్తే.. హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన 2 స్పోర్ట్స్ కోటా పోస్టులు కాకుండా, మిగిలిన 12 పోస్టులలో (7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులు) ఆయా కేటగిరీలకు తగిన అభ్యర్థులు లభ్యం కాలేదు.

Continues below advertisement

View Pdf

2023 డిసెంబర్ లో వచ్చిన నోటిఫికేషన్..ఈ గ్రూప్-2 నియామక ప్రక్రియ 2023 డిసెంబరు 7న విడుదలైన ప్రకటనతో ప్రారంభమైంది. 2024 ఫిబ్రవరి 25న అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వచ్చిన తరువాత, 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2025 ఏప్రిల్ 4న ఫలితాలను వెల్లడించినప్పటికీ, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల తుది ఎంపిక జాబితా విడుదల చేయడంలో జాప్యం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్ (11/2023) ద్వారా భర్తీ అవుతున్న 905 ఉద్యోగాల జాబితా, పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను ప్రధానంగా ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలుగా విభజించారు.

1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు (మొత్తం 331)డెప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar): రెవెన్యూ శాఖలో అత్యంత ఆదరణ ఉన్న పోస్ట్ (114 ఖాళీలు).ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Excise SI): ఎక్సైజ్ శాఖలో శాంతి భద్రతలు మరియు పర్యవేక్షణ (150+ ఖాళీలు).అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (Assistant Labour Officer): కార్మిక శాఖలో చట్టాల అమలు.మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: పట్టణ పరిపాలన విభాగం.సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ.అసిస్టెంట్ రిజిస్ట్రార్: సహకార సంఘాల విభాగం.ఎక్స్టెన్షన్ ఆఫీసర్: పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ.

2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు (మొత్తం 574)ఇవి ప్రధానంగా సచివాలయం, వివిధ ప్రభుత్వ శాఖలలో పరిపాలన, అకౌంట్స్ విభాగాలకు చెందినవి.అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO): ఏపీ సచివాలయం (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ విభాగాల్లో సుమారు 260+ పోస్టులు).సీనియర్ అకౌంటెంట్: ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ.సీనియర్ ఆడిటర్: స్టేట్ ఆడిట్ విభాగం.జూనియర్ అసిస్టెంట్: ఏపీపీఎస్సీ, వ్యవసాయ, సామాజిక సంక్షేమ, పోలీస్ (DGP ఆఫీస్) వంటి వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసుల్లో.జూనియర్ అకౌంటెంట్: ఖజానా, అకౌంట్స్ విభాగం.