తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద 704 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్‌ విధానంలో నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) కింద 704 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు.


ఎస్‌ఎస్‌ఏ పరిధిలో డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్ అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్లు తదితర పోస్టులను భర్తీ చేసేందుకు 2019 నవంబరులోనే విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిదే. డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించి.. 2020 జనవరిలో జిల్లాలవారీగా మెరిట్ ర్యాంకులను ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. 2022-23లో నియమించేందుకు విద్యాశాఖ మంత్రి దస్త్రంపై సంతకం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే 2022 మార్చిలో ప్రకటించారు. దాంతో సీఎం కార్యాలయం సూచన మేరకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా విద్యాశాఖ నిలిపివేసింది.


తాజాగా ప్రభుత్వం నియామకాలకు ఆమోదం తెలపడంతో 704 పోస్టులను భర్తీచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈమేరకు జులై 10న పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని, ఎంపికైనవారు జులై 13లోపు కొలువుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన నిర్దేశించారు. అధికార వర్గాలు మాత్రం ఎస్‌ఎస్‌ఏ అనేది ప్రాజెక్టు అని, శాశ్వత విభాగం లేదా శాఖ కాదని, అందువల్లే తీసుకుంటున్నట్లు చెబుతున్నాయి. కాగా గిరిజన ప్రాంతాల్లోనూ 50 శాతం నియామకాలను గిరిజనేతరులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020లో తీర్పు ఇచ్చింది. అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని స్థానిక, స్థానికేతర అనేది నిర్ణయించాలని, ఆ మేరకు మెరిట్ జాబితాను ప్రకటించి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీ నియామకాలను పూర్తిచేయాలని మార్గదర్శకాలు జారీచేశారు. ఎంపికైన వారి నుంచి 2024 ఏప్రిల్ 24 వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాల్సి ఉంటుందని ఒప్పందపత్రాలు తీసుకోవాలని సూచించారు. వారు డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.


ALSO READ:


ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్‌ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial