Ananthapuramu HMFW Recruitment: అనంతపురం జిల్లా వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(అనంతపురం), కాలేజ్ ఆఫ్ నర్సింగ్(అనంతపురం)లో 72 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబు 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 72

➥ అనస్తీషియా టెక్నీషియన్: 02

➥ అటెండర్: 03

➥ బయోమెడికల్ టెక్నీషియన్: 01

➥ కార్డియాలజీ టెక్నీషియన్: 02

➥ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్: 01

➥ ఛైల్డ్ సైకాలజిస్ట్: 01

➥ క్లాస్‌రూమ్ అటెండర్: 02

➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 02

➥ డెంటల్ హైజినిస్ట్: 02

➥ డెంటల్ టెక్నీషియన్: 04

➥ ఈసీజీ టెక్నీషియన్: 03

➥ ఎలక్ట్రీషియన్: 02

➥ ల్యాబ్ అటెండెంట్స్: 08

➥ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 08

➥ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02

➥ ఓటీ అసిస్టెంట్: 06

➥ స్ట్రెట్చర్ బేరర్: 01

➥ మార్చురీ అటెండెంట్: 02

➥ MRN టెక్నీషియన్/MRI టెక్నీషియన్: 02

➥ ఓటీ టెక్నీషియన్: 02

➥ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 01

➥ పర్‌ఫ్యూషనిస్ట్: 01

➥ ఫిజియోథెరపిస్ట్: 02

➥ ప్లంబర్: 01

➥ సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02

➥ రిఫ్రాక్షనిస్ట్: 03

➥ స్పీచ్ థెరపిస్ట్: 04

➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/నెట్ అడ్మినిస్ట్రేటర్: 01

అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో. 

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥నోటిఫికేషన్ వెల్లడి: 26.11.2023.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 04.12.2023. (5.00 PM)

➥ దరఖా స్తుల పరిశీలన: 06.12.2023.

➥ ప్రాథమిక ఎంపిక జాబితా: 18.12.2023.

➥ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 21.12.2023. (5.00 PM)

➥ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 27.12.2023.

➥ ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన, నియామక పత్రాలు: 30.12.2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: O/o. Principal, Govt.Medical College, Ananthapuramu.

Notification & Application

Website

ALSO READ:

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులున్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply