Telangana Assistant Professor Jobs |  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసింది. దరఖాస్తు తేదీల్లో మార్పులు చేసిన వైద్యశాఖ అభ్యర్థులు ఈ విషయాలు గమనించాలని సూచించింది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 పోస్టులకు జూన్ 10 నుంచి 17వ తేదీల్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది. అయితే డాక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది.

ఈ నెల‌ 20 నుంచి 27వ తేదీ వరకూ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం (జులై 11న) ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 20వ తేదీ నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్‌సైట్‌లో అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. జులై 28, 29 తేదీలలో అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.  మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల దృవీకరణ (Caste Certificate), తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.