విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ప్రొఫెషనల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకౌంటెన్సీ, బ్యాంకింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీకి చేయనున్నారు. అకౌంటెన్సీ విభాగంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాంకింగ్ విభాగంలో డిగ్రీ అర్హతతో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
ఈ పోస్టులు పూర్తిగా గౌరవ ప్రదమైన స్థాయిలో ఉంటాయి. అన్ని ఉద్యోగాల మాదిరిగా రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేవి కాదు అని అభ్యర్థులు గ్రహించాలి.
ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా 2023, జనవరి 17 వరకు లేదా ఎన్నికలు నిర్వహించే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థిని మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌గా కూడా నియమిస్తారు. సంస్థ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పూర్తి అధికారం ఉంటుంది.


వివరాలు..

* ప్రొఫెషనల్ డైరెక్టర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 02


విభాగాలు:
అకౌంటెన్సీ, బ్యాంకింగ్.

అర్హత:
అకౌంటెన్సీ విభాగంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్/ బ్యాంకింగ్ విభాగంలో డిగ్రీ అర్హతతో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేసి ఉండాలి.

ఇతర అర్హతలు:
ఏపీకి చెందినవారై ఉండాలి. 

అనుభవం:
కనీసం 10 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ విధానంలో. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తు పంపే ఎన్వలప్ కవరు మీద “APPLICATION FOR APPOINTMENT OF PROFESSIONAL DIRECTOR (ACCOUNTANCY/ BANKING) OF THE ANDHRA PRADESH STATE CO-OPERATIVE BANK LTD., VIJAYAWADAA” అని రాయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

Managing Director, The A.P. State
Cooperative Bank Ltd, NTR Sahakara Bhavan, 
D No. 27-29-28, Governorpet,
Vijaayawada-520002. A.P.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది:
17.11.2022.

Notification


Application


Website


Also Read:


హైదరాబాద్‌లో అప్రెంటిస్‌షిప్ మేళా - డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత!
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. డిప్లొమా, బీటెక్, ఏదైనా సాధారణ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావచ్చు. నవంబరు 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. 
అప్రెంటిస్ మేళా పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!
Post Office Jobs: దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


విజయనగరం డీఎంఎచ్‌వోలో ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి - అర్హతలివే!
విజయనగరంలోని జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుని అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధలు నవంబర్ 7లోపు దరకాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...