ఏపీటెట్ -2022 పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 14న సాయంత్రం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు కూడా తుది కీ చెక్ చేసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల్లో ఏపీటెట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.  ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు.




AP TET August 2022 Question Papers and Final KEY

Response Sheet(s) of Candidates


ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) పరీక్ష ఆగస్టు 6న ప్రారంభమై ఆగస్టు 21న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. అంతే కాకుండా  రాష్ట్రంతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్‌ 14 విడుదల కావాల్సి ఉంది. సెప్టెంబరు 12న టెట్ ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ సెప్టెంబరు 14న విడుదల చేశారు. ఇప్పటికే టెట్‌ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఆగస్టు 31న విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫైనల్ కీ విడుదల చేశారు. 


ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం టెట్ అధికారులు స్పందించడం లేదు. ఫలితాల విడుదల వాయిదా పడిన అంశంపై సైతం అధికారులు ప్రకటన విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు టెట్ విషయంలో మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ రోజు టెట్ ఫైనల్ కీ విడుదల అయితే.. ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.



Also Read:  ఏపీలో దసరా సెలవులు ప్రకటన ఎన్నిరోజులంటే?



పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఏపీలోని పాఠశాలలకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. దీంతో విద్యార్థులకు మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. సెలవుల తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలను నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఓమ్మార్‌ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్‌ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.


Also Read:   తెలంగాణలో 15 రోజుల 'దసరా' సెలవులు, ప్రకటించిన ప్రభుత్వం!



AP TET 2022 షెడ్యూల్:

నోటిఫికేషన్ విడుదల: జూన్‌ 10,2022

దరఖాస్తు రుసుములు చెల్లింపులు: జూన్‌ 15 నుంచి జులై 15 వరకు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 16 నుంచి జులై 16 వరకు.

హెల్ప్ డెస్క్ సేవలు: జూన్‌ 13 నుంచి ప్రారంభం.

ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: జులై 26 నుంచి

హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: జులై 25 నుంచి

పరీక్షల నిర్వహణ: 06.08.2022 నుంచి 21.08.2022 వరకు జరుగుతాయి.

ప్రాథమిక కీ విడుదల: 31.08.2022

అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 నుంచి 07.09.2022.

ఫైనల్‌ కీ విడుదల: 12.09.2022. (సెప్టెంబరు 14న విడుదల చేశారు)

ఫలితాల విడుదల: 14.09.2022 (ప్రకటించాల్సి ఉంది.)


 


Also Read:


APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:


NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..