AP TET 2022 : ఏపీలో నేటి (ఆగస్టు 6వ తేదీ) నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్ లైన్ విధానంలో టెట్ నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం గం.9.30ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం గం.2.30ల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరవ్వాలని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలో ఏర్పాటు చేశారు.
టెట్ లో ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే అర్హత మార్కులుగా నిర్థారించారు. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఈసారి టెట్ లో అర్హత సాధిస్తే అభ్యర్థులకు లైఫ్ లాంగ్ చెల్లుబాటు అయ్యేలా మార్పు చేశారు. ఆగస్టు 31వ తేదీన పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించారు. సెప్టెంబరు 12న ఫైనల్ కీ, 14న రిజెల్ట్స్ విడుదల చేయనున్నారు.
ఏపీ టెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో AP TET 2022 పరీక్షకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 16 నుంచి జులై 16 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది. టెట్ దరఖాస్తు ఫీజుగా ఒక్కో పేపర్‌కు రూ.500 వసూలు చేశారు.
ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్ కీ విడుదల చేసి, సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (National Council for Teacher Education - NCTE) అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
40 శాతానికి సడలింపు
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉంటే బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తుంది. కానీ టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన ఉంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారని, ఈ అర్హత మార్కులను 40 శాతానికి సడలించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్-1(A, B), ఆరో నుంచి ఎనిమిదో తరగతుల బోధనకు పేపర్-2 (A, B)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.