AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Continues below advertisement

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నవంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Continues below advertisement

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 6100

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం 100
విజయనగరం 134
విశాఖపట్నం (సిటీ) 187
విశాఖపట్నం (రూరల్) 159
తూర్పు గోదావరి 298
రాజమహేంద్రవరం (అర్బన్) 83
పశ్ఛిమ గోదావరి 204
కృష్ణా 150
విజయవాడ (సిటీ) 250
గుంటూరు (రూరల్) 300
గుంటూరు (అర్బన్) 80
ప్రకాశం 205
నెల్లూరు 160
కర్నూలు 285
వైఎస్సార్ - కడప  325
అనంతపురం 310
చిత్తూరు 240
తిరుపతి అర్బన్ 110
మొత్తం 3580

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630
రాజమహేంద్రవరం 630
మద్దిపాడు - ప్రకాశం  630
చిత్తూరు 630
మొత్తం 2520

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. 
 
శారీరక ప్రమాణాలు:

వయోపరిమితి:

🔰 01.07.2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1990 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

🔰కనీసం ఏడాది కాలంగా రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్నవారు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1998 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

🔰 నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు   

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.12.2022.

➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 09.01.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 22.01.2023.

Notification 

Online Application

Pay Application Fee

USER GUIDE

Website

Also Read:

ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
ఏపీలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిసెంబరు 14న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు 2023 జనవరి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola