పోలీసు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఒక ప్రశ్నకు సంబంధించి ఏపీ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన కీలలో సమాధానాలను ఒక్కోసారి ఒక్కోలా పేర్కొనడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సరైన రెండు ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అర్హత మార్కుల దగ్గరకొచ్చిన వారు నష్టపోతున్నారు. రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే కొందరు ఈ-మెయిల్ ద్వారా బోర్డుకు విన్నవించారు. కానిస్టేబుల్ ఎంపికకు ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22న నిర్వహించి ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేశారు.


విశాఖపట్నానికి చెందిన ఓ అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం సెట్-బి లోని 184వ ప్రశ్నలో కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఆ నాలుగింటికి సమాధానాలు 2, 4లలో ఉన్నాయి. జనవరి 23న బోర్డు విడుదల చేసిన ప్రాథమిక కీ లో రెండో ఆప్షన్, ఫిబ్రవరి 5న ఇచ్చిన తుది కీ లో నాలుగో ఆప్షన్ సరైనదని బోర్డు పేర్కొంది. రెండుసార్లు రెండు రకాలుగా పేర్కొనడంతో నష్టపోతున్నామని.. రెండింటిలో ఏ సమాధానమిచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇలాగా మరెందరో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు.


ఆన్సర్ కీపై 2261 అభ్యంతరాలు..
జనవరి 22న కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ  'కీ' నీ విడుదల చేయగా 2261 అభ్యంతరాలు వచ్చాయని పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. వాటిని సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి అవసరమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. 


ఫిబ్రవరి 13 నుంచి స్టేజ్-2 రిజిస్ట్రేషన్..
ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.


ఏపీలో 6,100 పోస్టుల భర్తీ కోసం జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 997 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు.


ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! 
ఏపీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఏపీ పోలీస్ నియామక మండలి ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎస్ఐ పోస్టులకు  దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...