ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే గ్రేడ్-2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇది పెండింగ్‌లో ఉండగానే తాజాగా.. 1681 మిడ్‌ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల(ఎంఎల్‌హెచ్‌పీ) భర్తీ ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది.


డాక్టర్ వైఎస్‌ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్‌లు-ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల్లో 1681 ఎంఎల్ హెచ్‌పీ నియామకం కోసం ఈ ఏడాది ఆగస్టు 9న ప్రజాఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మిషన్‌ డైరెక్టర్ నోటిఫికేషన్ ‌ఇచ్చింది. దీన్ని సవాలుచేస్తూ వైద్యులు పి.అనీల్  కుమార్, శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఈ ప్రక్రియలో ముందుకెళ్లడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.


 


Also Read: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!


ఈ తీర్పుపై డివిజినల్ బెంచ్‌లో శివకృష్ణ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఆయుష్ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్మాన్‌ భారత్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని కోర్టుకు తెలిపారు.


నోటిఫికేషన్‌ ప్రకారం.. బీఎస్సీ(నర్సింగ్‌)ను విద్యార్హతగా పేర్కొన్నారని వివరించారు. దేశంలోని ఏపీ మినహా అన్ని రాష్ట్రాలు పోస్టుల భర్తీలో ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున భర్తీకి అవకాశం ఇవ్వాలని.. రాబోయే ఎంపికల్లో వారి పేర్లను పరిశీలనకు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. అనంతరం ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధించింది.



:: Also Read ::


APPSC EXAM HALLTICKETS: వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 12న విడుదల చేసింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
హాల్‌టికెట్లు, పరీక్ష తేదీల కోసం క్లిక్ చేయండి..


APPSC: 'గ్రూప్-1' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.  గ్రూప్-1 పరిధిలో మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ  నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...