గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొబేషన్‌ పీరియడ్‌లో విధులు నిర్వహిస్తూ.. మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ అంగీకరించారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అక్టోబరు 27న కారుణ్య నియామకాలకు  సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు.


పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్‌ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: APPSC EO Result: దేవాదాయశాఖ ఈవో పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదల, ఫైనల్ కీ కూడా!


కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం జగన్ చాన్నాళ్ల కిందటే ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో తాజాగా కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.


Read Also: APPSC AEE Application: ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!


మరణించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. డి. జాని పాషా కృతజ్ఞతలు తెలిపారు. చిరు కుటుంబాలకు కొండంత ఆసరాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ.. మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో పలుమార్లు వినతులు అందించిన క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.


Also Read: APPSC:  వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు!


ప్రోబేషన్ పీరియడ్‌లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా కారుణ్యనియామకాలు వర్తింపజేస్తూ సచివాలయాల శాఖ అక్టోబరు 27న జీవో నెంబర్ 7ను విడుదల చేయడంతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వెలుగులు నింపిందని తెలుపుతూ సచివాలయ ఉద్యోగుల తరపున రాష్ట్ర అధ్యక్షుడు ఎం. డి. జాని పాషా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉద్యోగులకు వీలైన త్వరగా బదిలీలు కల్పించాలని కోరారు.



 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...