Faculty Posts At Universities | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండ‌ర్ మేర‌కు రాష్ట్రంలోని మొత్తం యూనివ‌ర్సిటీల్లో 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉన్న‌త విద్యాశాఖ విడుద‌ల చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ , కేడర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 1,523 పోస్టులలో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు (ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించిన పోస్టులు) ఉన్నాయి. వీటిని 6 నెలల్లోపు పారదర్శకంగా భర్తీ చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెంచ‌డానికి చేపట్టిన దశలవారీ చర్యలలో భాగంగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అర్హత కలిగిన శాశ్వత ప్యాకల్టీ నియామ‌కం వ‌ల్ల‌ నాణ్యమైన టీచింగ్, రీసెర్చ్, విశ్వవిద్యాలయాల గుర్తింపు (NAAC,NIRF ర్యాంకింగ్స్) మెరుగుపడటానికి వీలవుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చ‌దువుతున్న‌ విద్యార్థుల‌కు ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీ ఒక వ‌రంలాంటిదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 

మొత్తం 1,523 పోస్టుల కేడర్ వారీ వివరాలు 

కేడర్ రెగ్యులర్బ్యాక్‌లాగ్మొత్తం 
ప్రొఫెసర్ (Professor)63063
అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor)191143334
అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor)8861341,020
అసిస్టెంట్ లైబ్రేరియన్ (Assistant Librarian)022
లెక్చరర్ (RGUKT లో మాత్రమే)1040104
------------
మొత్తం (Grand Total)1,2442791,523

 

ఏపీ యూనివర్శిటీల వారీగా ఫ్యాకల్టీ పోస్టుల వివరాలు

 యూనివర్సిటీ / సంస్థరెగ్యులర్బ్యాక్‌లాగ్మొత్తం
1ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU), విశాఖపట్నం23214246
2శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU), తిరుపతి11015125
3శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU), అనంతపురం8122103
4ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU), గుంటూరు81182
5జేఎన్‌టీయూ అనంతపురం (JNTU-A)752095
6డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (YSRAFU)65065
7జేఎన్‌టీయూ కాకినాడ (JNTU-K)48856
8రాయలసీమ విశ్వవిద్యాలయం (RU), కర్నూలు47047
9శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి42648
10డాక్టర్ BR అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (BRAU), శ్రీకాకుళం42446
11ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (AKNU), రాజమహేంద్రవరం39847
12జేఎన్‌టీయూ గురజాడ, విజయనగరం (JNTU-GV)381048
13డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం (DrAHUU), కర్నూలు37037
14కృష్ణా విశ్వవిద్యాలయం (KU), మచిలీపట్నం36743
15విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU), నెల్లూరు351348
16ద్రావిడ విశ్వవిద్యాలయం (DU), కుప్పం15520
17ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం (AKU)909
18యోగి వేమన విశ్వవిద్యాలయం (YVU), కడప44347
19రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (RGUKT)208103311
 మొత్తం1,244279

కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో తొలిసారిగా ఫ్యాకల్టీ నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్  https://apuniversitiesrecruitment.apcfss.in  తీసుకొచ్చారు. అభ్యర్థి ఒక్కసారి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఏ యూనివర్సిటీలోని పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ అప్లికేషన్‌ను సంబంధిత యూనివర్సిటీకి పంపిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఆధార్-లింక్డ్ OTP వెరిఫికేషన్, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, తరువాత అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతారు. దీనిని నైపుణ్యం పోర్టల్ https://naipunyam.ap.gov.in/job-calendar ) తో పాటు అన్ని యూనివర్సిటీల వెబ్‌సైట్ల ద్వారా సైతం యాక్సెస్ చేయవచ్చు.

అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలు- కామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌లో నోటిఫికేషన్‌ తేదీ: మే 15- ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ ప్రారంభం : మే 18 - ఆన్‌లైన్‌ అప్లికేషన్, ఫీజు పేమెంట్ చివరి తేదీ: జూన్‌ 8- హార్డ్‌ కాపీతో అప్లికేషన్ సబ్మిట్ గడువు : జూన్‌ 15- అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌స్ అభ్యర్థుల ప్రైమరీ అర్హత జాబితా : జూన్‌ 22- ప్రాథమిక అర్హతపై అభ్యంతరాలకు చివరి తేదీ : జూన్‌ 29- స్క్రీనింగ్‌ టెస్ట్‌కు తుది అర్హత జాబితా వెల్లడి : జూన్‌ 30

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు APPSC ద్వారా రాత పరీక్షఅసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా రాత  పరీక్ష ఉంటుంది. ఒకవేళ  ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది అర్హత గల అభ్యర్థులు ఉన్న సందర్భంలో పరీక్ష నిర్వహిస్తారు. లేక‌పోతే నేరుగా స్క్రీనింగ్-కమ్-ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలనకు పంపి.. మీ అకడమిక్,  రీసెర్చ్ క్రెడెన్షియల్స్ మూల్యాంకనం, ఇంటర్వ్యూ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తుది ఎంపిక జరుగుతుంది.  స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రక్రియలు SC / ST / BC బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా అభ్యర్థులందరికీ ఒకే విధంగా ఉంటాయి. పారదర్శకంగా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని పోస్టులకు ఎంపిక చేయనున్నారు.  

కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెయిటేజీ ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను గుర్తిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారి అనుభవానికి వెయిటేజీ మార్కులు ఇస్తారు. అభ్యర్థి రాత పరీక్షలో ప్రతిభతో అర్హత సాధించిన తర్వాత మాత్రమే ఈ వెయిటేజీ పరిగణనలోకి తీసుకుంటారు. 

వివిధ వర్గాలకు రిజర్వేషన్లుప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లు,  మహిళలకు (33⅓ శాతం), దివ్యాంగులకు (4 శాతం), మాజీ సైనికోద్యోగులకు (2 శాతం), స్పోర్ట్స్ అభ్యర్థులకు 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు.