AP Fire Department Driver Operator Posts | అమరావతి: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ, ప్రాథమిక రాత పరీక్ష తేదీలు , ఇతర ముఖ్యమైన వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. గతంలో కూటమి హయాంలో 2018 నవంబరులో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి నియామక మండలి చర్యలు చేపట్టింది. అయితే, ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.

Continues below advertisement

గత నియామకాల్లో కేవలం శారీరక కొలతలు (ఫిజికల్ మెజర్‌మెంట్) పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ ఈసారి మారిన నిబంధనల ప్రకారం అభ్యర్థులకు మొదట శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు (PET) హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పీఈటీలో భాగంగా అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగును 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. 

Continues below advertisement

ఆ పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో ఉన్నతాధికారుల కమిటీ ఆధ్వర్యంలో 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరి దశగా రాత పరీక్ష (Written Test) నిర్వహించి తుది ఎంపిక పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in ను సందర్శించవచ్చు.

ఏజ్ లిమిట్ఫైర్ డిపార్ట్ మెంట్ డ్రైవర్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి . అంటే ఆ అభ్యర్థులు 1996 జులై 2 తర్వాత, 2008 జులై 1 కి ముందు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ (EWS) అభ్యర్థులకు ప్రభుత్వం 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. విద్యా అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు నోటిఫికేషన్‌ నాటికి కనీసం 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలి. 

2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) 2,050 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. వీటిలో 438 సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు (సివిల్-253, ఏఆర్-116, కమ్యూనికేషన్స్-50, పీటీఓ-10, ఎస్‌పీఎఫ్-9) మరియు 1,156 కానిస్టేబుల్ పోస్టులు (సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్లు) ఉన్నాయి.

వీటితో పాటు కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుళ్లు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) లో 198 డ్రైవర్లు, 43 సైంటిఫిక్ అసిస్టెంట్లు, 15 మెకానిక్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల రాత పరీక్ష తేదీల వివరాలను బోర్డు త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.