Andhra Pradesh DSC Notification 2025:నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. 16347 పోస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఆదివారం పది గంటలకు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులను ఆదివారం నుంచి (20-04-2025) ప్రారంభమయ్యాయి. మే 15 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్‌లు ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచి(When will Andhra Pradesh DSC exams be held?)
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ పరీక్షలు ఎలా ఉంటాయో మాక్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మాక్ టెస్టులు మే 20 నుంచి నిర్వహిస్తారు. అనంతరం హాల్‌టికెట్లను మే 30 నుంచి జారీ చేస్తారు. డీఎస్సీ పరీక్షలను జూన్ ఆరు నుంచి నెల రోజుల పాటు జరపనున్నారు. జులై ఆరు వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.
డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే
👉 https://cse.ap.gov.in👉 https://apdsc.apcfss.in
కీ ఎప్పుడు రిలీజ్ అవుతుందిఅన్ని పరీక్షలు పూర్తి అయిన రెండోరోజున ప్రాథమిక కీ విడదల చేస్తారు. అభ్యంతరాలను ఏడు రోజుల్లో స్వీకరిస్తారు. అనంతరం తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన ఏడు రోజుల్లో మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆదివారం ఉదయం పది గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖాధికారులు వివరిస్తారు. పూర్తి వివరాలను http://apdsc.apcfss.in/# వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.