AP DSC 2024 Exam: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల తేదీని పాఠశాల విద్యాశాఖ ఇటీవల రీషెడ్యూలు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి ప్రారంభంకావాల్సిన డీఎస్సీ పరీక్షలను హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారు చేసింది. ఇప్పుడిదే ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీసెట్, ఏపీపీఎస్సీ డిప్యూటీ డీఈవో పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ డిప్యూటీ డీఈవో స్క్రీనింగ్ పరీక్షను ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

చాలా మంది అభ్యర్థులు డీఎస్సీతో పాటు డిప్యూటీ డీఈవో, ఏపీ సెట్‌కు సిద్ధమవుతుంటారు. డీఎస్సీ పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ.. ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు.

ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూలు..

విషయం ముఖ్యమైన తేదీలు
పరీక్ష కేంద్రాల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు 20.03.2024 నుంచి.
డీఎస్సీ-2024 పరీక్ష హాల్‌టికెట్ల విడుదల 25.03.2024 నుంచి.
SGT పోస్టులకు పరీక్షలు 30.03.2024 నుంచి 03.04.2024 వరకు.
GT, PGT, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 07.04.2024.
స్కూల్ అసిస్టెంట్(SA), టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 13.04.2024 నుంచి 30.04.2024 వరకు.

టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టు ఏందంటే?
ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

ALSO READ:

'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే, పరీక్ష వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏపీపీఎస్సీ మార్చి 10న హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...