Andhra Pradesh DSC Results 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సాయంత్రం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/Resultsలో పెట్టారు. అభ్యర్థులు తమకు ఇచ్చిన ఐడీ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ మార్కులు చూసుకోవచ్చు. ఇదే టైంలో దరఖాస్తు చేసిన టైంలో కొందరు అభ్యర్థులు టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసుకున్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వాటిని సరిచేసుకునే ఛాన్స్ ఇచ్చింది.
టెట్ మార్కులు ఎలా సరి చేసుకోవాలి
- ముందుగా ప్రభుత్వం క్రియేట్ చేసిన అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/Resultsలోకి వెళ్లాలి.
- మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్, క్యాప్చాన్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
- అలా అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆరెంజ్కలర్ ట్యాబ్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి
- అందులో మీరు అప్లికేషన్ నింపినప్పటి నుంచి ఇప్పుడు రిజల్ట్ వరకు అన్నీ అందులో ఉంటాయి.
- అందులో నాలుగో కాలమ్ AP DSC-2025 Results అనే లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
- అలా క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో స్కోర్ కార్డు పేరుతో మీ ఫొటోతో రిజల్ట్స్ వస్తాయి.
- అందులో కిందికి వస్తే correct TET అనే ఆప్షన్ బ్లూ కలర్లో ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
- అలా క్లిక్ చేస్తే లేదంటే మీ వివరాలు ఎంటర్ చేసిన వెంటనే వెల్కమ్ డీఎస్సీ 2025 పేరుతో నోట్ కనిపిస్తుంది. అందులో కూడా క్లిక్ చేసి టెట్ మార్కులు కరెక్షన్ చేసుకోవచ్చు.
- అలా ఎడిట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వచ్చిన మార్కులతోపాటు టెట్ వివరాలు కూడా వస్తాయి. చివర ఉన్న టెట్ వివరాల పక్కన ఎడిట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ టెట్ హాల్ టికెట్ ఎప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయో ఎంటర్ చేయాలి.
- అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత కింద ఉన్న ఓటీపీపై క్లిక్ చేయాలి. మీకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ టెట్ మార్కులు అప్డేట్ అవుతాయి. ఓవరాల్ మార్కులు కూడా అప్డేట్ అవుతాయి.
- ఈ ప్రక్రియను ఆగస్టు 13 లోపు చేయాల్సి ఉంటుంది.
ఏపీ డీఎస్సీ స్కోర్ 2025 కార్డులో ఏమున్నాయి
ప్రతి అభ్యర్థి రాసిన పరీక్షల వివరాల స్కోర్ కార్డులోఉన్నాయి. ఆ వ్యక్తికి ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మొదటి కాలమ్లో కనిపిస్తాయి. తర్వాత నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చిన మార్కులు ఉంచారు. తర్వాత టెట్లో వచ్చిన మార్కులు, టోటల్ స్కోర్ను కూడా ఇచ్చారు. ఆఖరిలో మీరు క్వాలిఫై అయ్యారో లేదో చెప్పారు. ఇలా క్వాలిఫై అని వారిని మెరిట్ జాబితాలో ఉంచుతారు.
నార్మలైజేషన్ అంటే ఏంటీ?
ఒకే సబ్జెక్ట్కు సంబంధించిన పరీక్ష వివిధ రోజుల్లో జరిగాయి. అందుకే ఒకరికి పేపర్ సులభంగా మరొకరికి పేపర్ కఠినంగా వచ్చి ఉంటుంది. కఠినంగా వచ్చిన వాళ్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు అన్ని పేపర్లు నార్మలైజ్ చేస్తారు. ఇలా నార్మలైజ్ చేసిన తర్వాత అందరికీ సమానంగా మార్కులు వచ్చేలా చేస్తారు. అందుకే కొందరికి ఎగ్జామ్లో వచ్చిన మార్కుల కంటే పెరగడమో తగ్గడమో జరిగి ఉంటుంది.