AP DSC 2024 Online Application: ఆంధ్రప్రదేశ్‌లో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఫిబ్రవరి 12న) ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఫిబ్రవరి 21 వరకు మాత్రమే ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

అర్హతలు..

➥ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. (లేదా) బీసీఏ/బీబీఎంతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఇంటర్ స్థాయిలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి.

➥ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు రెండేళ్ల డీఎడ్/ డీఎల్‌ఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.

➥ ప్రిన్సిపల్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ లేదా రెండేళ్ల ఇంటిగ్రేడెట్ పీజీ కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. నిర్ణీత అనుభవం తప్పనిసరి.

➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులకు 50 శాతం మార్కులతో సంబంధి విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. దీంతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. 

➥ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు 50 శాతం మార్కులతో సంబంధి విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.

➥ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు బీపీఈడీ లేదా ఎంపీఈడీ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

➙ ఓసీ అభ్యర్థులు 01.07.1980 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 01.07.1975 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ దివ్యాంగులు 01.07.1970 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

➥ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా చదువుకోవాలి.

➥ దరఖాస్తు చేసుకునే పోస్టుకు తగిన అర్హతలు తమకు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

➥ మొదట నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాత అప్లికేషన్‌లో ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత మొత్తంలో ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

➥ ఫీజు చెల్లింపు వివరాలను (జనరల్ నెంబరు), అప్లికేషన్ నంబర్లను భద్రపరచుకోవాలి. 

➥ అప్లికేషన్ ప్రక్రియకు అవసరమైన వివరాలు, ఫోటోలు తదితరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

➥  దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 12.02.2024.
ఫీజుచెల్లింపు తేదీలు 12.02.2024 - 21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 22.02.2024.
ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో 24.02.2024.
పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ 05.03.2024 నుంచి.
ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్)
ప్రిలిమినరీ ఆన్సర్ కీ వెల్లడి 31.03.2024.
ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.
ఫైనల్ కీ వెల్లడి 08.04.2024
డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి 15.04.2024 

ప్రభుత్వ/జిల్లాపరిషత్/మండల పరిషత్ / మున్సిపల్/ ఆశ్రమ పాఠశాలల్లో 4566 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ గురుకులాల్లో 1534 ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

Fee Payment

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...