ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.


ఉద్యోగాల వారీగా ప్రాథమిక ఫలితాలు..


స్టెనోగ్రాఫర్

టైపిస్ట్

కాపిస్ట్

డ్రైవర్(లైట్ వైకిల్)

జూనియర్ అసిస్టెంట్

ఫీల్డ్ అసిస్టెంట్

ఎగ్జామినర్

రికార్డ్ అసిస్టెంట్

ప్రాసెస్ సర్వర్

ఆఫీస్ సబార్డినేట్


జిల్లా కోర్టు ఫలితాల ప్రకటన వివరాలు


Website 


Also Read:


పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...