AP Senior Resident Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 241 పోస్టులను 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 12వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 241
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ అనాటమీ: 25
⏩ ఫిజియాలజీ: 15
⏩ బయోకెమిస్ట్రీ: 20
⏩ ఫార్మకాలజీ: 20
⏩ పాథాలజీ: 23
⏩ మైక్రోబయాలజీ: 20
⏩ ఫోరెన్సిక్ మెడిసిన్: 15
⏩ కమ్యూనిటీ మెడిసిన్: 20
⏩ మెడిసిన్: 15
⏩ పీడియాట్రిక్స్: 05
⏩ డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ (DVL): 04
⏩ సైకియాట్రీ: 04
⏩ జనరల్ సర్జరీ: 15
⏩ ఆర్థోపెడిక్స్: 03
⏩ ఒటోరినోలారిన్జాలజీ: 04
⏩ ఆప్తాల్మాలజీ: 04
⏩ ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 08
⏩ అనస్థీషియాలజీ: 09
⏩ రేడియో డయాగ్నసిస్: 10
⏩ డెంటిస్ట్రీ: 02
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులు ఎంపికకు అర్హులు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఎపీ మెడికల్/ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న స్థానికేతర అభ్యర్థులు సీనియర్ రెసిడెన్సీ పోస్టులకి అర్హులు.
వయోపరిమితి: 03.05.2024 నాటికి 44 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000. బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులు రూ 500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ. రూ.70 వేలు
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్‌లు..
➥ పుట్టిన తేదీ ద్రువీకరించే 10వ తరగతి సర్టిఫికేట్.
➥ ఏపీ మెడికల్ కౌన్సిల్‌తో పీజీ డిగ్రీ రిజిస్ట్రేషన్
➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) మార్కుల లిస్ట్.
➥ డిగ్రీ/ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కాపీ
ఎంబీబీఎస్/బీడీఎస్
పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ ఎండీఎస్)
➥ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్(ఎస్సీ/ఎస్టీ/బీసీఏ/బీసీబీ/బీసీసీ/బీసీడీ/బీసీఈ/ఈడబ్ల్యూఎస్)
➥ ఆధార్ కార్డ్
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
ముఖ్యమైనతేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.05.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2024.
Notification
ALSO READ:
కేంద్ర సాయుధ బలగాల్లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్ (BSF), సీఆర్‌పీఎఫ్ (CRPF), సీఐఎస్‌ఎఫ్ (CISF), ఐటీబీపీ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి 'సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 24న విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..