APPSC Group1 Marks Memo: ఏపీలో 'గ్రూప్‌-1' మార్కుల వెల్లడి విధానంలో ఇటీవల ఏపీపీఎస్సీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రూప్‌-1 (నోటిఫికేషన్‌ నంబర్‌ 28/ 2022) మార్కుల మెమోలను మార్చి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మార్కుల మెమోల కోసం అభ్యర్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని సూచించింది. అభ్యర్థులు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా మాత్రమే మార్కుల మెమొరాండంలోని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు అందరికీ తెలిసే అవకాశం లేదు.


గ్రూప్-1 (Notification no: 28/2022) మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..


ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాని కంటే ఏడు నెలలు ఆలస్యంగా, అదీ దరఖాస్తు చేసిన వారికే మార్కులు తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. ఏపీపీఎస్సీ ప్రకటనపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజుల్లో తామే మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులోనికి తెస్తామని మార్చి 21న ఒక ప్రకటనలో పేర్కొంది. ఎవరూ దరఖాస్తు చేయక్కర్లేదని సూచించింది. అభ్యర్థులు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా మాత్రమే మార్కుల మెమొరాండంలోని వివరాలు తెలుసుకోవచ్చునని షరతు పెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు అందరికీ తెలిసే అవకాశం లేదు.


యూపీఎస్సీలో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. 2022 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెలరోజుల తర్వాత.. కోరినవారికి మార్కుల మెమొరాండం అందిస్తామని పేర్కొన్నా, అలా చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మార్చి 19న ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. మార్కుల మెమొరాండం అవసరమైనవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే, రెండు వారాల తర్వాత వారికి వచ్చిన మార్కులను లాగిన్ విధానంలో తెలుసుకునే అవకాశం కల్పిస్తామని అందులో వెల్లడించింది.


అభ్యర్థులు తమకు రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కుల గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇవి తెలిస్తేనే పోటీలో తాము ఎక్కడున్నామో.. ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడగలరు. అందుకే యూపీఎస్సీ ఈ మార్కులను అభ్యర్థులకు తెలియబరుస్తుంది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం మార్కుల వెల్లడిపై ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్ ప్రాథమిక కీ వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమొరాండం ఉండదని తెలిపింది. కానీ.. ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినవారికి కోర్టు కేసు ఉందని కమిషన్ సమాధానమిస్తోంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...