AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!

ఏపీ హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి ఐదేళ్ల లా డిగ్రీ లేదా డిగ్రీతోపాటు మూడేళ్ల లా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు.

Continues below advertisement

ఏపీ హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి ఐదేళ్ల లా డిగ్రీ లేదా డిగ్రీతోపాటు మూడేళ్ల లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

పోస్టుల సంఖ్య: 13

పోస్టుల కేటాయింపు: జనరల్-07, బీసీ-02, ఎస్సీ-02, ఎస్టీ-01, ఎక్స్-సర్వీస్‌మెన్-01.

అర్హత: ఐదేళ్ల లా డిగ్రీ లేదా డిగ్రీతోపాటు మూడేళ్ల లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

జీతం: రూ.40,970 - రూ.1,24,380.

రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోప్రశ్నలకు ఒకమార్కు ఉంటుంది. వీటిలో జనరల్ నాలెడ్జ్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, లా విభాగం నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు.  


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:15.11.2012.


Notification

Website

:: ఇవీ చదవండి ::

Google Recruitment: గూగుల్‌ సంస్థలో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు, దరఖాస్తు చేసుకోండి!
గూగుల్ సంస్థ వివిధ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డిజిటల్ మార్కెటింగ్,ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్   అప్రెంటిస్‌షిప్‌లను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు అక్టోబర్ 27 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పనిచేయవలిసిన ప్రాంతాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, గుర్గావ్. సంబంధిత విభాగంలో తగినంత పని అనుభవం ఉండాలి. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola