కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్(అలిమ్కో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌/ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ పీజీడీఎం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాకు మార్చి 13 వరకు స్పీడు పోస్టు/రిజిస్టర్డ్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 24

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ మేనేజర్(సోర్సింగ్)

➥ మేనేజర్(టెక్స్‌టైల్)

➥ డిప్యూటీ మేనేజర్(సివిల్)

➥ డిప్యూటీ మేనేజర్(ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)

➥ డిప్యూటీ మేనేజర్(స్టోర్స్)

➥ అసిస్టెంట్ మేనేజర్ (కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్),

➥ అసిస్టెంట్ మేనేజర్ - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (మెకానికల్, ఎలక్ట్రికల్),

➥ అసిస్టెంట్ మేనేజర్ (ట్రైనింగ్, ప్లాస్టిక్),

➥ జూనియర్ మేనేజర్ - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్(మెకానికల్)

➥ సివిల్ ఇంజనీరింగ్

➥ ఆఫీసర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్(మెకానికల్)

➥ ఫైర్

➥ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్

➥ సర్వీస్ అసిస్టెంట్-జనరల్

➥ డేటా అనలిస్ట్/ సైంటిస్ట్ 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌/ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ పీజీడీఎం ఉత్తీర్ణత.

వయోపరిమితి: 40-50 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.105000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:  ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

చిరునామా: Manager (Personal & Administration)Artificial Limbs Manufacturing Corporation of IndiaG.T. Road, Kanpur – 209217 (U.P)

దరఖాస్తు చివరి తేది: 13.03.2023. 

Notification

Website 

Also Read:

హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...