తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు అక్టోబరు 4న విడుదలైన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు; 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా.. తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి పోలీస్ నియామక బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబరు 5న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసిన వారికి కొద్ది రోజుల్లో ఆన్‌లైన్‌లోనే అధికారులు సమాధానం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ఎలాంటి వ్యక్తిగత వినతులను నేరుగా ఇవ్వడాన్ని అంగీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.


కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లలో పొందుపరిచారు. అలాగే, అభ్యర్థుల కటాఫ్, ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.


కానిస్టేబుల్ ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..


'అటెస్టేషన్' పత్రాల సమర్పణ తప్పనిసరి...
తుది ఎంపిక జాబితాలో ఎంపికైన అభ్యర్థుల కోసం వ్యక్తిగత లాగిన్‌లలో అటెస్టేషన్ పత్రాలను అక్టోబరు 7 నుంచి 10 వరకు అందుబాటులో ఉంచనున్నారు. వాటిని డిజిటల్‌గానే పూరించి అనంతరం డౌన్‌లోడ్ చేసుకొని పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అతికించి మూడు సెట్లపై గెజిటెడ్ సంతకాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా పత్రాలను అక్టోబరు 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్-సీపీఎల్, రవాణా కానిస్టేబుల్(ప్రధాన కార్యాలయం) అభ్యర్థులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో, టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్(ఎల్సీ) అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలని ఒక ప్రకటనలో పేర్కొంది.


ALSO READ:


ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీజీ డిగ్రీ/ ఎంఏ/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.  కంప్యూటర్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..