ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 596
1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 62 పోస్టులు
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 84 పోస్టులు
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 10 పోస్టులు
అర్హత: 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21/01/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: గేట్(2020/ 2021/ 2022) స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.12.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.01.2023.
Also Read:
Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
ఏపీలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిసెంబరు 14న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు 2023 జనవరి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...