Air India Engineering Services Limited Notification: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌(AIESL)లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సూపర్‌వైజర్ (Assistant Supervisor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలున్నవారు జనవరి 15లోగా ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. రాతపరీక్ష/ స్కిల్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


* అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 209.


ఏఐఈఎస్‌ఎల్‌ ఇంజినీరింగ్ యాక్టివిటీ సెంటర్లవారీగా ఖాళీలు: ఢిల్లీ-87, ముంబయి-70, కోల్‌కతా-12, హైదరాబాద్-10, నాగ్‌పుర్-10, తిరువనంతపురం-20.


అర్హత: బీఎస్సీ/ బీకాం/ బీఏ, కంప్యూటర్‌ సర్టిఫికేట్ కోర్సుతో పాటు డేటా ఎంట్రీ/కంప్యూటర్ అప్లికేషన్‌లలో ఏడాది పని అనుభవం. లేదా బీసీఏ/ బీఎస్సీ (సీఎస్‌)/ ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణతతో పాటు డేటా ఎంట్రీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.01.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1000.  బ్యాంకులో RTGS / NEFT ఆధారితంగా ఫీజు చెల్లించాలి.


ఫీజు చెల్లించాల్సిన అకౌంట్ నెంబరు వివరాలు..
“AI Engineering Services Limited”
Bank Name: STATE BANK OF INDIA
A/C No: 41102631800
IFSC: SBIN0000691
Branch: New Delhi Main Branch, 11, Parliament Street, New Delhi-110001.


దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు స్కాన్డ్ కాపీ, ఇతర కాపీలు జతచేసి పంపాలి. అదేవిధంగా గూగుల్ ఫామ్ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.


వేతనం: రూ.27,000.


దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: careers@aiesl.in


దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ: 15.01.2024.


దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన డాక్యుమెంట్లు..


➥ పదోతరగతి, గ్రాడ్యుయేషన్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి పాసింగ్ సర్టిఫికేట్


➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/OBC అభ్యర్థులకు)


➥ ఓబీసీ అభ్యర్థులైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్


➥ ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాలి.


Notification & Application


Google form link for Appplication Form


Website



ALSO READ:


జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 85 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- జీఐసీఆర్ఈ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...