న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(నార్‌సెట్)- 6 నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నార్‌సెట్-6 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేస్తారు.
వివరాలు..
* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ సంస్థలు..
➥ ఎయిమ్స్ భటిండా
➥ ఎయిమ్స్ భువనేశ్వర్
➥ ఎయిమ్స్ బిలాస్‌పూర్
➥ ఎయిమ్స్ దేవ్‌ఘర్
➥ ఎయిమ్స్ గోరఖ్‌పూర్
➥ ఎయిమ్స్ గువాహటి
➥ ఎయిమ్స్ కల్యాణి
➥ ఎయిమ్స్ మంగళగిరి
➥ ఎయిమ్స్ నాగ్‌పుర్
➥ ఎయిమ్స్ రాయ్ బరేలీ
➥ ఎయిమ్స్ న్యూఢిల్లీ
➥ ఎయిమ్స్ పాట్నా
➥ ఎయిమ్స్ రాయ్‌పూర్
➥ ఎయిమ్స్ విజయ్‌పూర్
అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నార్‌సెట్-6 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.
జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2024.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 18.03.2024 నుంచి 20.03.2024 వరకు.
➥ సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 14.04.2024.
➥ సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ: 05.05.2024.
ALSO READ:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 314 ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 314 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన, సంబంధిత విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 18వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.