న్యూఢిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 100.

1. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (మెయింటెనెన్స్‌/ ఓవర్‌హాల్‌, ఏవియానిక్స్‌)

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 సంత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

2. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (ఏవియానిక్స్‌, ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటల్‌/ రేడియో)

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 సంత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

3. టెక్నీషియన్‌ (ఫిట్టర్‌/ షీట్‌ మెటల్‌, కార్పెంటర్‌, వెల్డర్‌)

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 సంత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

4. టెక్నీషియన్‌ (ఎక్స్‌-రే/ ఎన్‌డీటీ)

అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్) లేదా డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) లేదా బీటెక్‌(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 సంత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు : రూ.1000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.28,000.

దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2024.

Notification

Google form link for APPLICATION FORM 

Website 

ALSO READ:

ISRO Jobs: ఇస్రోలో 224 సైంటిస్ట్/ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.  సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులకు రూ.56,100; టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900; టెక్నీషియన్-బి/డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులకు రూ.21,700; కుక్/ఫైర్‌మ్యాన్-ఎ/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’&హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ పోస్టులకు రూ.19,900.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...