AIASL Recruitment: న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ జైపూర్ ఎయిర్‌పోర్టులో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్- టెక్నికల్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 145 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఇంజినీరింగ్‌లో మెకానిక్, గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఇంటర్, ఐటీఐ, ఎస్ఎస్‌సీతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 8 నుంచి 11వ తేదీ వరకు వాక్-ఇన్‌కి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 145
⏩ జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫుల్‌టైమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(మెకానికల్ / ఆటోమొబైల్ / ప్రొడక్షన్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణత ఉండాలి. గరిష్టంగా 12 నెలలలోపు చెల్లుబాటు అయ్యే హెవీ మోటర్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస సమయ వ్యవధిలో హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.29,760.
⏩ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 21 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10+2+3 ప్యాటర్న్‌లో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. ఎయిర్‌లైన్/జీహెచ్‌ఏ/కార్గో/ఎయిర్‌లైన్ టికెటింగ్ అనుభవం లేదా ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా డిప్లొమా ఇన్ ఐఏటీఏ(IATA)-యూఎఫ్‌టీఏఏ(UFTAA) లేదా ఐఏటీఏ(IATA)-ఎఫ్ఐఏటీఏ(FIATA) లేదా ఐఏటీఏ(IATA)-డీజీఆర్(DGR) లేదా ఐఏటీఏ(IATA)-కార్గో వంటి సర్టిఫైడ్ కోర్సులు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పీసీని ఉపయోగించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.24,960.
⏩ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 21 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. ఎయిర్‌లైన్/జీహెచ్‌ఏ/కార్గో/ఎయిర్‌లైన్ టికెటింగ్ అనుభవం లేదా ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా డిప్లొమా ఇన్ ఐఏటీఏ(IATA)-యూఎఫ్‌టీఏఏ(UFTAA) లేదా ఐఏటీఏ(IATA)-ఎఫ్ఐఏటీఏ(FIATA) లేదా ఐఏటీఏ(IATA)-డీజీఆర్(DGR) లేదా ఐఏటీఏ(IATA)-కార్గో వంటి సర్టిఫైడ్ కోర్సులు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పీసీని ఉపయోగించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.21,270.
⏩ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 18 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన 3 సంవత్సరాల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్) లేదా ఐటీఐతో పాటు 3 సంవత్సరాలు ఎన్‌సీటీవీటీ సర్టిఫికేట్ (మోటార్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్/ ఎయిర్ కండిషనింగ్/ డీజిల్ మెకానిక్/ బెంచ్ ఫిట్టర్)/ వెల్డర్(ఎన్‌సీటీవీటీతో కూడిన ఐటీఐ – డైరెక్టరేట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ నుండి జారీ చేయబడిన సర్టిఫికేట్ అండ్ ఒక సంవత్సరం అనుభవంతో ఏదైనా రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ శిక్షణ) హిందీ/ ఆంగ్లం/ స్థానిక భాష ఒక సబ్జెక్టుతో ఎస్‌ఎస్‌సీ/తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో అభ్యర్థి తప్పనిసరిగా ఒరిజనల్ వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ (HMV)ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
వయోపరిమితి:28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.24,960.
⏩ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 17 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో అభ్యర్థి చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీమోటర్ వెహికల్(HMV)ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
వయోపరిమితి:28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.21,270.
⏩ హ్యాండీమ్యాన్: 66 పోస్టులు
అర్హత:ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషలపై పట్టు ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.18,840.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు పుంచి మినహాయింపు ఉంది. “AI AIRPORT SERVICES LIMITED” ముంబయి పేరిట డీడీ తీయీలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికేట్‌లతో నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశంలో తమ దరఖాస్తులను అందచేయాలి.
ఎంపిక విధానం..
జూనియర్ ఆఫీసర్ – టెక్నికల్ / కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్:
పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ..
గ్రూప్ డిస్కషన్ ఆధారంగా..
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ / యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్:
➥ ట్రేడ్ టెస్ట్ అనేది హెవీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ టెస్ట్‌తో సహా ట్రేడ్ నాలెడ్జ్ మరియు డ్రైవింగ్ టెస్ట్‌ను కలిగి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు పంపబడతారు.
➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.
హ్యాండీమ్యాన్:
➥ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ వంటివి). కేవలం ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పంపుతారు.
➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.
వేదిక:
Madhyawart AviationAcademy , 102
Vinayak Plaza,Doctors colony Budh
Singh Pura, Sanganer, Jaipur: 302029
వాక్-ఇన్ తేదీలు..
🔰 జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 8.05.2024.
సమయం: ఉదయం09:30 గంటల నుంచి మధ్యహ్యం 12:30 గంటల వరకు
🔰 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 9.05.2024.
సమయం: ఉదయం09:30 గంటల నుంచి మధ్యహ్యం 12:30 గంటల వరకు
🔰 ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 10.05.2024.
సమయం: ఉదయం09:30 గంటల నుంచి మధ్యహ్యం 12:30 గంటల వరకు
🔰 హ్యాండీమ్యాన్: 11.05.2024.
సమయం: ఉదయం 09:30 గంటల నుంచి మధ్యహ్యం 12:30 గంటల వరకు