AFMS Recruitment 2023: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* మెడికల్ ఆఫీసర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 650 (మెన్-585, ఉమెన్-65)


అర్హత: ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: ఎంబీబీఎస్ డిగ్రీ అభ్యర్థులు 30 సంవత్సరాలు, పీజీ డిగ్రీ అభ్యర్థులు 35 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 16.10.2023


➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 05.11.2023


Notification  


Website


ALSO READ:


ఇండియన్ ఆర్మీలో 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో జులై-2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్)-2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈఎంఆర్‌ఎస్‌లో 10,391 ఉద్యోగాల దరఖాస్తుకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించారు. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు- జులై 31తో, టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు గడువును  పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నెస్ట్స్‌ తెలిపింది.  డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..