30 to 34 percent salary hike likely for government employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతోంది. 8వ వేతన సంఘం అమలు కోసం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ప్రభుత్వ జీతాలు , పెన్షన్లను 30-34% పెంచాలని సిఫారసు చేసే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది.
ఈ సంవత్సరం జనవరిలో 8వ వేతన సంఘాన్ని నియమించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు , పెన్షన్ల పెరుగుదల ఎంత ఉటుందనే దానిపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు , పెన్షన్లలో 30-34% పెరుగుదల సంభవించవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
జనవరి 2016 - డిసెంబర్ 2025 మధ్య ఏడో వేతన సంఘం 14 శాతం జీతాల పెంపును అమలు చేసింది. ఇది 1970 తర్వాత అత్యల్పం. జీతాల పెంపును అమలు చేసింది. ఈ సారి మాత్రం ఉద్యోగుల ఆశల్ని మోసుకెళ్లనుంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకోవడానికి ప్రైవేట్ రంగంతో పోటీ పడేలా ప్రభుత్వ జీతాలను పెంచడానికి ప్రత్యేకంగా ప్రతి పదేళ్లకు ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూంటారు. 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, సభ్యులు , ఛైర్మన్‌కు సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. 2016లో అమల్లోకి వచ్చిన 7వ CPCని 8వ వేతన సంఘం భర్తీ చేస్తుంది. 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం, భత్యాలు, పెన్షన్లు , పదవీ విరమణ ప్రయోజనాలను రివ్యూ చేసి సిఫారసు చేస్తుంది .
వేతన సంఘం సిఫార్సులు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలోని దాదాపు 44 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 68 లక్షల మందిల పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రభుత్వ జీతాల పెంపును నిర్ణయించడంలో 'ఫిట్‌మెంట్ ' కీలకం. ఏదైనా వేతన సంఘం కోసం సవరించిన ప్రాథమిక వేతనం ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని ఫిట్‌మెంట్ ద్వారా లెక్కిస్తారు. ఇది లబ్ధిదారులకు వేతన పెరుగుదలను నిర్ణయిస్తుంది. 8వ వేతన కమిషన్ 1.83 - 2.46 మధ్య ఫిట్ మెంట్ ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు.