కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(టైర్-2)-2021 పరీక్షకు సంబంధించిన తుదీ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టైర్-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్ కీ చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. నవంబర్ 10 వరకు ఆన్సర్ కీ అందుబాటులో ఉండనుంది. 


సీజీఎల్ 2021 టైర్-2 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి...


కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్‌ఈ)-2021 టైర్-2 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా టైర్-2, 3 పరీక్షలు వివిధ కేంద్రాల్లో జరిగాయి. మొత్తం 7686 పోస్టుల భర్తీకి సీజీఎల్‌ఈ-2021 పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.


మొత్తం నాలుగు జాబితాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో ఏఏవో పోస్టులకు 2602 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండో జాబితాలో 511 మంది అభర్థులు జేఎస్‌వో పోస్టులకు అర్హత సాధించారు. మూడో జాబితాలో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 2631 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్టులో ఉన్నారు.  ఇక చివరిదైనా నాలుగో జాబితాలో ఏఏవో, జేఎస్‌వో, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు కాకుంగా ఇతర ఉద్యోగాలకు 32,610 మంది అభ్యర్థులు షార్ట్‌టిస్ట్‌కు ఎంపికయ్యారు.



:: ఇవీ చదవండి ::UPSC Recruitment 2022: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇలా!


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేయనుంది. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి..
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...