అన్వేషించండి

ABP India At 2047 Conclave: సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు- స్వయంసమృద్ధి, సుసంపన్నతే లక్ష్యం: ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా

ABP Network CEO Sumanta Datta | భారత్ 2047 నాటికి ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఉండాలనే విషయంపై ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. సవాళ్లను భారత్ అవకాశంగా మలుచుకుందని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో భారత్ తన చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిందని ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా అన్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బుధవారం ఉదయం 'ఇండియా@2047 సదస్సు' (India@2047 Summit) ప్రారంభోత్సవంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తయ్యే పూర్తవుతుందని, పౌరులు ఆశించే నవభారత నిర్మాణమే మన ఉమ్మడి జాతీయ లక్ష్యం కావాలని ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు. మనందరినీ ఒకే ఒక గొప్ప ఆలోచన ఏకం చేస్తోంది.. దేశంలో శతాబ్ది ఉత్సవాలు జరిగే 2047 నాటికి, మనం కోరుకునే నవభారతాన్ని ఎలా నిర్మించుకోవాలనేదే అందరి ముందున్న లక్ష్యమని సుమంత దత్తా పేర్కొన్నారు.

ఇండియా@2047 కేవలం ఒక ఈవెంట్ కాదు..  ఒక విజన్
2047 సంవత్సరం క్యాలెండర్‌లో కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదని, దేశాన్ని సమూలంగా మార్చేందుకు దక్కిన ఒక చారిత్రాత్మక అవకాశమని సుమంత దత్తా పేర్కొన్నారు.  మనమందరం కలలుగనే నవ భారతాన్ని నిర్మించుకునే ఒక సువర్ణావకాశం. కేవలం అవకాశాలు ఉన్న దేశం అనే స్థాయి నుంచి.. స్వయం సమృద్ధి, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచేలా ప్రోత్సహించే సమాజంగా మన దేశం మారాలని ఆయన ఆకాంక్షించారు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నాడు భారత దేశం కోసం కలలుగన్న "ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే ప్రతి ఒక్కరూ తల ఎత్తుకుని జీవిస్తారో" అనే భావనకు ఈ విజన్ అద్దం పడుతుందని ఆయన గుర్తుచేశారు.

వేగంగా మారుతున్న ప్రపంచం.. సరికొత్త సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయంగా పలు రంగాల్లో ఊహించని మార్పులు చూస్తున్నామని దత్తా చెప్పారు. "ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ (అంతర్జాతీయ సరఫరా గొలుసులు) వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మారుతున్న టెక్నాలజీ పరిశ్రమల స్వరూపాన్నే మార్చేస్తోంది. ఇంధన వనరుల వ్యవస్థలు పునర్నిర్మితం అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ సమాజాల పనితీరునే మార్చేస్తోందని" ఆయన అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయడంతో పాటు, అన్ని దేశాలకూ సరికొత్త అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Also Read: ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్

అనిశ్చితిలోనూ అద్భుత అవకాశం
అదే సమయంలో అంతర్జాతీయంగా తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందని సుమంత దత్తా గుర్తుచేశారు. భౌగోళిక రాజకీయ ఆటంకాలు, ఆర్థిక అనిశ్చితి అనేవి ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ చూసే వాస్తవాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఇలాంటి సవాళ్ల మధ్య కూడా భారత్ తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి, మారుతున్న ప్రపంచ క్రమంలో వస్తున్న అవకాశాలను అందుకోవడానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇన్ని మార్పులు జరుగుతున్నా.. ఒక దేశంగా మన ప్రయాణంలో మనం ఒక అరుదైన, అత్యంత కీలకమైన సమయంలో ఉన్నామని పేర్కొన్నారు. 2047 వైపు సాగే ప్రయాణంలో భారత్ తీసుకునే నిర్ణయాలు ఎంత ముఖ్యమైనవో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

ఏబీపీ ఇండియా @2047 కాన్‌క్లేవ్ ప్రారంభం
స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి (2047 నాటికి) భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా సాగిస్తున్న ప్రయాణంపై రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, సినీ, సాంస్కృతిక ప్రముఖులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. బిల్డింగ్ భారత్ @ 2047 (Building Bharat @ 2047) అనే థీమ్‌తో నిర్వహిస్తున్న కాన్‌క్లేవ్‌ న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ప్రారంభమైంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుపరిపాలన, ఇంధన వినియోగంలో మార్పులు, భారత్ తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగాల ప్రముఖులు హాజరై విలువైన తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. 

Frequently Asked Questions

'ఇండియా@2047 సదస్సు' ఎక్కడ జరిగింది?

ఈ సదస్సు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో జరిగింది. ఇది 'బిల్డింగ్ భారత్ @ 2047' అనే థీమ్ తో నిర్వహించబడింది.

2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలని సుమంత దత్తా ఆకాంక్షించారు?

2047 నాటికి భారతదేశం స్వయం సమృద్ధి, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ, ప్రతి రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచేలా ప్రోత్సహించే సమాజంగా మారాలని కోరుకున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సప్లై చైన్స్ రూపాంతరం చెందుతున్నాయి, మారుతున్న టెక్నాలజీ పరిశ్రమల స్వరూపాన్ని మారుస్తోంది, ఇంధన వనరుల వ్యవస్థలు పునర్నిర్మితం అవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సమాజాల పనితీరును మారుస్తోంది.

ప్రపంచ అనిశ్చితిలో కూడా భారత్ కు అవకాశాలు ఉన్నాయా?

అవును, భౌగోళిక రాజకీయ ఆటంకాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి, మారుతున్న ప్రపంచ క్రమంలో వస్తున్న అవకాశాలను అందుకోవడానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
Embed widget