Milk Digestion Problems: చిన్నప్పుడు పాలు తాగినప్పుడు సులభంగా జీర్ణమవుతాయి. అదే వయసు పైబడిన తర్వాత పాలు మీ కడుపును ఇబ్బంది పెడతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది. నిజంగా పాలు తాగడంతో మీ శరీరం ఇబ్బంది పడుతుందా లేదా అది కేవలం ఒక అపోహేనా? శాస్త్రవేత్తలు దీనికి DNA, నిర్దిష్ట ఎంజైమ్, లాక్టేజ్, వయస్సుతోపాటు మారుతుందని చెబుతున్నారు. ఇది ఎందుకు? ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
పెద్దవారికి కడుపు ఉబ్బరం వంటి కడుపు సమస్యలు వచ్చినప్పుడు, వైద్యులు తరచుగా పాలు లేదా టీ తాగకూడదని సలహా ఇస్తారని మీరు తరచుగా గమనించి ఉండవచ్చు. ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచ వయోజన జనాభాలో దాదాపు 75% మంది పాలు తాగిన తర్వాత ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. వారంతా బాల్యంలో సులభంగా పాలు తాగిన వారు కూడా ఉన్నారు. బాల్యంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఏర్పడుతుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం లాక్టోస్ .
నిజానికి, బాల్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ పాలు తాగి జీర్ణించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే శరీరం లాక్టేజ్ అనే ప్రత్యేక ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్ పాలలోని లాక్టోస్ చక్కెరను విచ్ఛిన్నం చేసి, దానిని ఉపయోగపడే శక్తిగా మారుస్తుంది. అందుకే పిల్లలు పాలు తాగడం ద్వారా సులభంగా పోషకాహారం పొందవచ్చు.
కానీ కాలక్రమేణా, చాలా మంది ఈ సామర్థ్యాన్ని కోల్పోతారు. కొంతమంది 3 సంవత్సరాల వయస్సులోనే, కొందరు 20 సంవత్సరాల వయస్సులోనే, మరికొందరు ఎక్కువ కాలం పాలు తాగలేరు, మరికొందరు ఈ సామర్థ్యాన్ని ఎప్పటికీ కోల్పోరు.
బాల్యంలో ఈ లాక్టేజ్ జన్యువు చురుగ్గా ఉన్నవారు పిల్లలుగా ఉన్నప్పుడు పాలు తాగవచ్చు, కానీ వయసు పెరిగే కొద్దీ ఈ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. పెద్దయ్యాక కూడా పాలు తాగగలిగే వారికి నిర్దిష్ట DNA మ్యుటేషన్ ఉంటుంది.
శాస్త్రవేత్తలు దీనిని లాక్టేజ్ పెర్సిస్టెన్స్ అని పిలుస్తారు. అంటే వారి శరీరాలు లాక్టేజ్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి, దీనివల్ల లాక్టోస్ జీర్ణం కావడం సులభం అవుతుంది. ఇది సహజ పరిణామ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునేవారిలో ఈ జన్యువు మ్యూటేషన్ అవుతూ ఉంటుంది. అయితే పాలు తాగే అలవాటు లేనివారిలో, చాలా మంది పెద్దయ్యాక పాలను జీర్ణం చేసుకోలేకపోతుంటారు. అందుకే కొందరు పాలు తాగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు.