ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తుల్లో, ఆ కంపెనీ ఎన్నింటిని ఆమోదించి డబ్బులు చెల్లించిందో తెలిపేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR).
Health Insurance Claim Settlement Ratio: ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెట్ రేషియో ఎంత ఉంది? బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
Health Insurance Claim Settlement Ratio: మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే అంతకంటే ముందు మీరు కొన్ని విషయాలును కచ్చితంగా తెలుసుకోవాలి. వాటి గురించి ఇక్కడ చూద్దాం.

Health Insurance Claim Settlement Ratio: ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయ్యే ఖర్చు సామాన్యుడికి గుండెపోటు తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక భరోసాగా నిలుస్తోంది. అయితే ఆపద సమయంలో ఆదుకుంటుందని మనం కట్టే ప్రీమియంలు,నిజంగానే అవసరమైనప్పుడు మన చేతికి అందుతున్నాయా? ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయి? గత ఐదేళ్లలో భారత్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ రేట్ ఎలా ఉంది? వచ్చిన మార్పులు ఏంటో ఇక్కడ చూద్దాం.?
అసలు క్లెయిమ్ సెటిల్‌మెట్ రేషియో అంటే ఏంటీ?
ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత నమ్మకమైనదో చెప్పడానికి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒక ముఖ్యమైన కొలమానం. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తుల్లో, ఆ కంపెనీ ఎన్నింటిని ఆమోదించి డబ్బులు చెల్లించిందో తెలిపేదే ఈ సీఎస్‌ఆర్. ఉదాహరణకు వంద క్లెయిమ్‌లు వస్తే, అందులో 95 క్లెయిమ్‌లు సెటిల్ చేస్తే దాని సీఎస్‌ఆర్ 95 శాతం అని అర్థం. దీని ఆధారంగానే ఏ సంస్థ పాలసీ తీసుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.
గత ఐదేళ్ల ట్రెండ్ ఏం చెబుతోంది?
గత ఐదేళ్ల డేటాను విశ్లేషిస్తే, భారతీయ ఇన్సూరెన్స్ రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2018-2020 అంటే కరోనా కంటే ముందు ఇన్సూరెన్స్ రంగం స్థిరంగా ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు కంటే మెరుగైనవిగా ఉండేవి. కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2020-21 ఇన్సూరెన్స్‌రంగంపై పెను ప్రభావం చూపింది. క్లెయిమ్‌ల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రాసెసింగ్ ఆలస్యమైంది. అనేక క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యాయి. దీని ప్రభావంతో 2022-2024 మధ్యలో సగటు క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేటు సుమారు 83 శాతానికి చేరుకుంది. అప్పట్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కారణంగా ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. ప్రజలు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో 2024-25లో కంపెనీల సీఎస్‌ఆర్ 90 శాతానికి పెరిగింది.
టాప్ ఫెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీలు ఏవీ?
2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లెక్కల ప్రకారం కేవలం హెల్త్ ఇన్సూరెన్స్‌పైనే దృష్టి పెట్టిన కంపెనీలు మంచి ఫలితాలను సీఎస్‌ఆర్ ను అందిస్తున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్, గేలక్సీ హెల్త్, నారాయణ హెల్త్, నివా బూపా వంటి కంపెనీలు వంద శాతం సీఎస్‌ఆర్ సాధించి రికార్డు సృష్టించాయి. కేర్ హెల్త్, కేర్‌హెల్త్ ఇన్సూరెన్స్ 99.5 శాతం సీఎస్‌ఆర్ ఉంటే, స్టార్ హెల్త్ 99.81 శాతంతో టాప్ కంపెనీలకు చేరువలో ఉంది.
ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిస్థితి చూస్తే... ACKO జనరల్ ఇన్సూరెన్స్ 99.9 శాతంతో టాప్‌లో ఉంది. రిలయన్స్ జనరల్(99.32), హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (98.32), ఐసీఐసీఐ(98.45) వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్‌లకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. IFFCO Tokio వంటి కంపెనీలు 90 శాతాని కంటే తక్కువ రేషియోతో వెనుకబడి ఉన్నాయి.
ప్రభుత్వ రంగం సంస్థలైన యునైటెడ్ ఇండియా 95.26 శాతంతో, నేషనల్ ఇన్సూరెన్స్ 91.79 శాతం, న్యూ ఇండియా ఎస్సూరెన్స్ 91.75 శాతం, ఓరియంటల్ ఇన్సూరెన్స్ 90.17 శాతం సీఎస్ఆర్ రేషియోను కలిగి ఉన్నాయి.
అసలు సమస్య ఎక్కడ వస్తుంది? క్లెయిమ్ రిజెక్షన్‌కు కారణాలేంటి?
చాలా మంది పాలసీ తీసుకుంటారు కానీ క్లెయిమ్ సమయంలో చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎదుర్కుంటారు. దీనికి ప్రధానంగా కొన్ని లోపాలు కారణమవుతాయి. పాలసీ తీసుకునేటప్పుడు తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను వెల్లడించరు. దీని వల్ల 12 నుంచి 4 శాతం క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయి. కొనని వ్యాధులకు పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ రాదు. రెండు నుంచి నాలుగేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ గడువు తెలియక క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. కాస్మెటిక్స్ సర్జరీలు, సంతాన లేమి చికిత్సలు వంటి కొన్ని అంశాలు ఇన్సూరెన్స్‌లో కవర్ కావు. వీటిపై అవగాహన లేకపోవడం వల్ల 36 శాతం తిరస్కరణ జరుగుతాయి. మీరు లక్ష క్లెయిమ్ చేస్తే, కంపెనీ కేవలం 70వేలు లేదా 80 వేలు మాత్రమే ఇస్తుంది. ఇలా సంఖ్యాపరంగా క్లెయిమ్ సెటిల్ అయినట్టు అనిపించినా, విలువల పరంగా చూస్తే అది కేవలం 71 శాతం మాత్రమే ఉంటోంది.
ఐఆర్‌డీఏఐ కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(IRDAI) కొన్ని సంస్కరణలు చేపట్టింది. క్యాష్‌లెస్ క్లెయిమ్స్ దరఖాస్తు చేసిన మూడు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని కంపెనీలను ఆదేశించింది. పాలసీలను సులభంగా పోల్చుకోవడానికి క్లెయిమ్ చేసుకోవడానికి ఒకే ప్లాట్‌ఫామ్ తీసుకురానుంది. పాలసీ డాక్యుమెంట్లలో ఉండే సాంకేతిక పదాలను తగ్గించి సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చేయనుంది.
క్లెయిమ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి?
పాలసీ ఫామ్ నింపేటప్పుడు మీ ఆరోగ్య చరిత్రను ఏ మాత్రం దాచుకోవద్దు. ఏ వ్యాధులు కవర్ కావు, రూమ్ రెంట్ లిమిట్ ఎంత వంటి విషయాలను ముందే తెలుసుకోండి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ మీ ఇంటి దగ్గర ఉన్నాయో లేవో, క్యాష్‌లెస్ సదుపాయం ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకోండి. కేవలం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మాత్రమే కాకుండా, ఇన్సూర్డ్ క్లెయిమ్ రేషియో కూడా చూడండి. అంటే కంపెనీకి వచ్చిన ప్రీమియంలో ఎంత శాతం క్లెయిమ్ రూపంలో తిరిగి ఇస్తుందో చెబుతోంది.
Frequently Asked Questions
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏమిటి?
కోవిడ్ తర్వాత ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
కోవిడ్ తర్వాత క్లెయిమ్ ల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రాసెసింగ్ ఆలస్యమైంది. దీని ప్రభావంతో 2022-2024 మధ్య సగటు CSR సుమారు 83 శాతానికి చేరుకుంది. 2024-25 నాటికి ఇది 90 శాతానికి పెరిగింది.
క్లెయిమ్ రిజెక్షన్ కు ప్రధాన కారణాలు ఏమిటి?
పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలను దాచడం, ముందుగా ఉన్న వ్యాధులకు సంబంధించిన నిబంధనలు తెలియకపోవడం, మరియు బీమాలో కవర్ కాని చికిత్సల కోసం క్లెయిమ్ చేయడం వంటివి ప్రధాన కారణాలు.
IRDAI ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియను మెరుగుపరచడానికి ఎలాంటి కొత్త నియమాలను తీసుకొచ్చింది?
IRDAI క్యాష్‌లెస్ క్లెయిమ్స్ కు మూడు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని, పాలసీలను పోల్చుకోవడానికి ఒకే ప్లాట్‌ఫామ్ తీసుకురావాలని, మరియు పాలసీ డాక్యుమెంట్లను సులభతరం చేయాలని ఆదేశించింది.























