నిశ్శబ్దంగా నిద్రపోయే వారితో పోల్చుకుంటే గురక పెట్టే వారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనం వెల్లడి చేస్తున్నాను. గురకతో రాత్రుళ్లు భాగస్వామి నిద్రాభంగం కలిగించే వారిలో స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వర పేటిక, శ్వాస మార్గాల్లోని కండరాలు వదులు కావడం వల్ల నిద్రలో ఉన్నపుడు ఇక్కడి కండరాలు మరింత విశ్రాంతి స్థితికి చేరుకుని శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. అందువల్ల మంచి నిద్ర సమయంలో శ్వాసలో ఇబ్బంది ఏర్పడి.. నిద్ర నుంచి మెలకువ వస్తుంది. వారితో కలిసి నిద్రపోయే వారికి గురక శబ్దం వల్ల నిద్రాభంగం కలిగి నిద్ర చాలకపోవటం మాత్రమే కాదు తరచుగా శ్వాసలో ఇబ్బంది ఏర్పడి నిద్రాభంగం కలిగి గురక పెట్టే వారికి మరింత ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


దాదాపు 4,500 వందల మంది వయసు మళ్లినవారి మీద జరిపిన అధ్యయనంలో నిద్ర సమస్యలు ఉన్న వారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం గురించి పరిశీలనలు జరిపారు. ఒక గంటపాటు కునుకు తీసే వారు మెలకువగా ఉండేవారి కంటే 88 శాతం వరకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట గురక వల్ల నిద్రాభంగం కలిగే వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువట. నిద్ర సమస్యలున్న వారితో డాక్టర్లు మాట్లాడి ఈ వివరాలను వెల్లడి చేశారు. నిద్ర సమస్యలున్న వారిలో స్ట్రొక్ ప్రమాదం ఎక్కువ అని నిర్థారిస్తున్నారు.


మెదడుకు రక్త ప్రసరణ జరిపే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు స్ట్రోక్ వస్తుంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు గురకపెడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒకరికి తప్పకుండా 24 గంటల్లో కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండడం లేదట. నిద్ర సరిపోకపోవడం వల్ల కేవలం బ్రెయన్ స్ట్రోక్ మాత్రమే కాదు గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ఇతర ప్రమాదాలు కూడా పెరుగుతాయి.


న్యూరాలజి జర్నల్ లో ప్రచురించిన తాజా అధ్యయనం నిద్రా సమయం స్ట్రోక్ ప్రమాదం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించింది. ఈ అధ్యయనంలో వారి నిద్రా ప్రవర్తనల గురించి వాకబు చేశారు. ఎంత సమయం పాటు నిద్రపోతారు? వారి నిద్ర నాణ్యత ఎలా ఉంటుంది? నిద్ర పోతున్నపుడు గురక లేదా శ్వాససంబంధ సమస్యలు బాధిస్తాయా వంటి విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.


రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపొయ్యే వారిలో స్ట్రోక్ బారిన పడే ప్రమాదం సగటున 7 గంటలు నిద్ర పొయ్యే వారితో పోలిస్తే 3 రెట్ల వరకు ఎక్కువగా ఉంటుందని తేల్చారు. గురక వల్ల పదేపదే శ్వాసలో ఇబ్బంది ఏర్పడి నిద్రా భంగం కలిగే వారికి అలాంటి సమస్య లేని వారితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టేనట. నిద్రను మెరుగు పరచుకునే మార్గాలను అన్వేషించడం, నిద్రా సమయాన్ని, నిద్ర నాణ్యతను పెంచుకోవడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే అధ్యయనాలు, పరిశోధనలకు ఈ అధ్యయన వివరాలు సహకరిస్తాయని కూడా ఈ అధ్యయనకారులు అభిప్రాయపడతున్నారు.