Rotator Cuff Injury: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఆయనకు ముంబై వైద్యులు చికిత్స చేశారు. రెండింటికీ ఒకేసారి సర్జరీ చేస్తే ఇబ్బంది అవుతుందని మొదట కుడి భుజానికి చికిత్స చేశారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది. సమస్య ఉన్నట్టు ఎలా గుర్తించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం.
మనం భుజం కీలు అంటే షోల్డర్ జాయింట్ బంతి-గిన్నె అమరికను కలిగి ఉంటుంది. ఈ కీలు స్థిరంగా ఉండటానికి, చేయిని గుడ్రంగా తిప్పడానికి, పైకి ఎత్తడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి పనులు చేయడానికి ఈ అమరికతోపాటు నాలుగు ముఖ్యమైన కండరాలు, వాటి టెండన్స్ కూడా సహయం చేస్తుంటాయి. మొత్తం పార్టును రొటేటర్ కఫ్ అంటారు. ఈ కండరాలు దెబ్బతినడం , వాపు రావడం, లేదా చిట్లిపోవడమే రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అంటారు.
అసలు ఈ రొటేటర్ కఫ్ గాయాలు ఎందుకు అవుతాయి?
ప్రమాదవశాత్తు కింది పడడం, చేయి చాచి బలంగా నేలకు గుద్దుకోవడం, బరువైన వస్తువులను ఆకస్మికంగా ఎత్తడం వల్ల కండరాలు ఒక్కసారిగా చిట్లిపోతాయి. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన గతంలో చేసిన సినిమా స్టంట్లు, షూటింగ్‌లో జరిగిన ప్రమాదాలు ఇందుకు కారణం కావచ్చు.
అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలం తగ్గుతుంది. దీంతో అవి బలహీనపడతాయి. దీనికి తోడు చేతులు పదే పదే పైకి ఎత్తే పనులు చేయడం కూడా కారణం కావచ్చు. స్పోర్ట్స్, పెయింటింగ్, చేతులు ఊపుతూ జనాల్లో ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
రొటేటర్ కఫ్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు
భుజం లోపలి భాగం మొద్దుబారినట్టు లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. తల దువ్వుకోవడం, వెనకకు చేయి చాచడం, వస్తువులను అందుకోవడానికి చేయి పైకి ఎత్తినప్పుడు తీవ్రమన నొప్పి వస్తుంది. చేయి పైకి లేవదు.
సమస్య ఉన్నవైపు భుజంపై పడుకున్నప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. నిద్ర కూడా పట్టదు. దెబ్బతిన్న చేత్తో కనీసం బరువులను కూడా ఎత్తలేకపోవడం, చేయి బలహీనంగా అనిపిస్తుంది. భుజాన్ని కదిలించినప్పుడు లోపల ఏదో అడ్డం పడుతున్టన్టు లేదా క్లిక్ అనే శబ్దాలు రావడం గమనించవచ్చు.
రొటేటర్ కఫ్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
క్రమం తప్పకుండా భుజం చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేసే స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ వ్యాయామాలు చేయాలి. కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు వంగిపోకుండా, భుజాలను వెనుకకు నిటారుగా ఉంచాలి. దీని వల్ల భుజం కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. జిమ్‌లో వర్కౌట్‌లు చేసేట్పుడు లేదా ఇంట్లో పనులు చేసేటప్పుడు భుజాలపై మోయలేని బరువులు వేయకూడు. చేతులను నిరంతరం పైకి ఎత్తి ఉంచే పనులు చేసే వారు మధ్య మధ్యలో భుజాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. నొప్పి చిన్నగా మొదలవుతున్నప్పుడే బరువులు ఎత్తడం ఆపేయాలి. తిగిన విశ్రాంతి ఇవ్వాలి. ఐస్ ప్యాక్ పెట్టాలి. నొప్పి తగ్గకపోతే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి.
