Rapamycin is an Anti-Ageing Pill: రపామైసిన్ అనే సాధారణ టాబ్లెట్ చుట్టూ అసాధారణ నమ్మకాలు ఏర్పడ్డాయి. కొవిడ్ సమయంలో సంజీవనిలా పని చేసిన ఈ పిల్‌తో జీవితకాలం పెంచుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ఈ జాబితాలో శాస్త్రవేత్తలు, బిలయనీర్లు కూడా ఉన్నారు. కొంత మంది ఐతే తమ ఆస్తులు అన్నీ అమ్ముకొని ఈ టాబ్లెట్ వాడుతూ తమ జీవితాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకునేలా రపామైసిన్ చుట్టూ మిత్‌లు అల్లుకున్నాయి.
రపామైసిన్‌పై ఉన్న నమ్మకంతో సంస్థను అమ్ముకున్న వ్యక్తి:
బ్రియన్ జాన్సన్.. 47 ఏళ్ల టెక్ ఎంట్రప్రెన్యూర్. మిలయనీర్ కూడా. ఇతడికి ఎక్కువ కాలం జీవించాలని కోరిక. దాని కోసం వివిధ రకాలైన డైట్ పద్ధతులు, మందుల వాడకంతో పాటు రపామైసిన్‌పైనా ఆధారపడ్డారు. ఎక్కువ కాలం బతకాలన్న కోరికతో తన బ్రెయిన్ ట్రీ సంస్థను 2013లో పేపాల్‌కు 800 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఆ విషయాన్ని కొన్నేళ్ల తర్వాత బయటపెట్టారు. మరణం లేని జీవితాన్ని అనుభవించడం కోసమే ఆ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ యాంటి ఏజింగ్ కోసం ఏటా 2 మిలియన్ డాలర్ల వరకూ బ్రియాన్ ఖర్చు చేస్తున్నారు. ప్రతి రోజూ ఒక క్రమ పద్ధతిలో డైట్ ఫాలో అవడం, పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం సహా రపామైసిన టాబ్లెట్ కూడా తన జీవితంలో భాగం అయిందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎపిజెనెటిక్ వయస్సుతో పోల్చితే 5న్నరేళ్లు తక్కువగా మారిందని తన బ్లూప్రింట్ వెబ్‌సైట్ ద్వారా తెలిపారు. అతడు రపామైసిన్ 13 ఎంజీ తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇతడే కాదు మిఖైల్ బ్లగోస్‌క్లోనీ అనే రష్యన్ ఆంకాలజీ, యాంటీ ఏజింగ్ స్పెషలిస్టు కూడా రపామైసిన్ అద్భుతాలు చేస్తుందని ప్రకటించారు. కణజాలం వయస్సుకు సంబంధించిన TOR సిగ్నలింగ్‌పై రపామైసిన్ ప్రభావం చూపుతుందని ఈయన పేర్కొన్నారు. బ్రియాన్ ఒక్కళ్లే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రపామైసిన్‌పై ఆధారపడి ఎక్కువ కాలం జీవించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అసలు రపామైసిన్ ఎవరు తయారు చేశారు.. దాని చుట్టూ మిత్‌లు ఎందుకు?
రపామైసిన్ టాబ్లెట్ ఇటీవలే గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. అత్యంత జనరిక్ మెడిసిన్‌గా పేరున్న ఈ రపామైసిన్ 1972లో చిలీలోని ఈస్టర్ ఐలాండ్ లేదా నేటివ్స్ పిలుచుకునే రపా నూయీ ఐలాండ్‌లో ఒక బ్యాక్టీరియంగా దొరికింది. దీనికి ఇమ్యునోసప్రెసివ్‌ను ట్రీట్ చేసే లక్షణాలున్నాయని గుర్తించిన శాస్త్రవేత్తలు మెడిసిన్‌గా అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి మానవజాతి ఎదుర్కొన్న ప్రళయం కొవిడ్ సమయం వరకూ ఒక దివ్య ఔషధంలా పని చేస్తూ కోట్లాది ప్రాణాలను నిలబెట్టింది.
ఇదొక యాంటి ఏజింగ్‌గా పనికొస్తుందని విశ్వసిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలకు 2009లో బలం చేకూరింది. మనుషుల వయస్సు 60తో సమానమైన వయస్సు కలిగిన ఎలుకలపై ఈ రపామైసిన్‌తో చేసిన ప్రయోగాలు ఫలితాన్నిచ్చాయని యూఎస్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలుకల జీవితకాలం 28 నుంచి 38 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. మనుషులలో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. అప్పటి నుంచి మనుషుల వయస్సు కూడా పెరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేదా ప్రయోగాలు జరగనప్పటికీ బ్రయిన వంటి మిలయనీర్లు రపామైసిన్‌పై ఆధారపడడంతో ప్రపంచ వ్యాప్తంగా రపామైసిన్ చుట్టూ మిత్‌లు అల్లుకున్నాయి.
డాక్టర్లు ఏమంటున్నారు..?
ఈ విషయంలో వైద్యుల మధ్య భేధాభిప్రాయాలు ఉన్నాయి. మిఖైల్ వంటి వైద్యులు ఇది సాధ్యమే అని అభిప్రాయపడుతున్నారు. ఇమ్యూనిటీని కంట్రోల్‌లో ఉంచే ఈ టాబ్లెట్‌తో TOR సిగ్నలింగ్‌ను ప్రభావితం చేయడం సాధ్యమే అంటున్నారు. మరి కొందరు వైద్యులు మాత్రం పరిమితికి మించి రపామైసిన వాడడం వల్ల ఆరోగ్య పరంగా దుష్ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినొచ్చని అంటున్నారు. ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని, గాస్ట్రిక్ సమస్యలకు కారణం అవుతుందని, నోట్లో అల్సర్లు ఏర్పడొచ్చని, బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తేడాలు, లిపిడ్ లెవల్స్‌లో ఛేంజెస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ టాబ్లెట్ వాడుతూ ఎక్కువ కాలం బతకడానికి ప్రయత్నిస్తున్న వారందరూ మిలయనీర్లే. వాళ్లందరికీ అన్ని రకాల వైద్యపరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉంటాయి. సామాన్యులు వీటిని ఇలా ఎక్కువ కాలం బతకడానికి ఒక సాధనంగా వినియోగించాలని చూడడం ప్రమాదకరంగా పరిణమించొచ్చని వైద్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఈ చెట్టు బెరడుతో బీపీ సమస్య మటుమాయం అవుతుందట