CBT Telugu: మీ మొబైల్ ఫోన్‌ను ఒక నిమిషం పాటు లాక్ లేకుండా ఉంచండి. మీ డేటా, ప్రైవసీ, బ్యాంకు వివరాలు క్షణాల్లో వేరేవాళ్లకు చేరిపోతాయి. అందుకే మనం అలాంటి ముఖ్యమైన గాడ్జెట్స్‌కు లాక్‌ చేస్తాం. మరి మీ మైండ్ సంగతి ఏంటి? ఇది మీ జ్ఞాపకాలు, కలలు, భావోద్వేగాలు, రహస్యాలు – అన్నీ స్టోర్ చేసే అతి పెద్ద ‘క్లౌడ్ స్టోరేజ్’కి ‘పాస్‌వర్డ్’ పెట్టుకోకపోతే ఎలా? 

Continues below advertisement

తాజాగా సైకాలజీ ప్రపంచంలో పెరుగుతున్న హెచ్చరిక ఏమిటంటే నెగటివ్ ఆలోచనలు, బాహ్య ఒత్తిడి లాంటి ‘హ్యాకర్లు’ లోపలికి చొరబడి మీ సంతోషాన్ని హ్యాక్ చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని క్రాష్ చేస్తున్నాయి. మేయో క్లినిక్ రీసెంట్ స్టడీ ప్రకారం, ‘మైండ్ పాస్‌వర్డ్’ లేనివారు 40% ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మంది మానసిక సమస్యలతో పోరాడుతున్నారంటే, అందులో చాలా మందికి మైండ్ ప్రొటెక్షన్ లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

మైండ్‌కు పాస్‌వర్డ్ అంటే డిజిటల్ కోడ్ కాదు. ఇది మన మానసిక రక్షణ వ్యవస్థ – ‘మెంటల్ బౌండరీస్’. ఈ బౌండరీలను అర్థం చేసుకోవడం, సెట్ చేయడం ద్వారా, మనం ఉద్యోగంలో బర్నౌట్‌ను తగ్గించుకోవచ్చు, సంబంధాలను ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు, మన జీవితాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  

Continues below advertisement

సైకలాజికల్ ఫైర్‌వాల్: ఏంటీ ఈ ‘మెంటల్ బౌండరీస్’?

మనస్సుకి పాస్‌వర్డ్ అనేది ఒక రహస్య కోడ్ కాదు; అది ‘మెంటల్ బౌండరీస్’. ఈ హద్దులు మన అవసరాలను ప్రయారిటైజ్ చేసి, ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడానికి సహాయపడతాయి. మేయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ ప్రకారం, ఇవి అనవసరమైన కనెక్షన్‌లను నివారించి, మన సంబంధాలను ఆరోగ్యకరంగా మారుస్తాయి.

ఈ భావన వెనుక ఉన్న బలమైన సైన్స్ ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’. సీబీటీ సిద్ధాంతం ప్రకారం, నెగటివ్ ఆలోచనలు ‘వైరస్‌’లు వంటివి, వాటిని బ్లాక్ చేయడానికి ఈ బౌండరీస్ ‘ఫైర్‌వాల్’లా పనిచేయాలి. డా.ఎలిజబెత్ ఎలియట్, హార్వర్డ్ సైకాలజిస్ట్, మన మైండ్‌ను ఒక బ్యాంక్‌తో పోల్చారు: "పాస్‌వర్డ్ లేకపోతే, ఎవరైనా లోపలికి వచ్చి మన ఆస్తులను దోచుకుంటారు". ఇందులో కూడా అలానే జరుగుతుందని చెబుతారు. 

ఉదాహరణకు: మీరు ఏదైనా అనుకున్నప్పుడు పక్కన ఉండే వాళ్లు అది అవ్వదమ్మా అంటే  

• పాస్‌వర్డ్ ఉంటే: మీరు "ఇది అతని వ్యూ, నా రియాలిటీ కాదు" అని ఆలోచిస్తారు. ఆ నెగటివిటీ మీ ఆత్మవిశ్వాసాన్ని క్రాష్ చేయకుండా బ్లాక్ చేస్తారు.

• పాస్‌వర్డ్ లేకపోతే: ఆ మాటలు నేరుగా మీ మైండ్‌లోకి చేరి, "నేను ఫెయిల్యూర్" అనే ఆలోచనను సృష్టించి, మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ (APA) స్టడీ ప్రకారం, ఈ మెంటల్ బౌండరీస్ సెల్ఫ్-కేర్‌లో భాగమని, ఇవి వర్క్‌ప్లేస్ బర్నౌట్‌ను 30% వరకు తగ్గిస్తాయి.

పాస్‌వర్డ్ లేని మైండ్: విధ్వంసకర నష్టాలు

మైండ్‌కు పాస్‌వర్డ్ లేకపోతే, అది ‘ఓపెన్ బుక్’లా మారిపోతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా భారీ నష్టాలు జరుగుతాయి. బౌండరీస్ లేకపోతే స్ట్రెస్, బర్నౌట్, రిలేషన్‌షిప్ సమస్యలు తప్పవు.

1. తీవ్రమైన మానసిక ఒత్తిడి: నెగటివ్ కామెంట్లు, విమర్శలు నేరుగా లోపలికి చేరడం వల్ల రోజూ టెన్షన్ పెరుగుతుంది. పాస్‌వర్డ్-లేని మైండ్‌లు 30% ఎక్కువ ఆంక్షైటీకి గురవుతాయని స్టడీలు చెబుతున్నాయి.

2. డిప్రెషన్, లో సెల్ఫ్-ఎస్టీమ్: 'కంపారిజన్ వైరస్' వల్ల మైండ్ డార్క్ అవుతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రెండింతలు పెరుగుతాయని మెడ్‌సర్కిల్ రిపోర్ట్ చేసింది.

3. ఫిజికల్ హెల్త్ డ్యామేజ్: అధిక స్ట్రెస్ వల్ల స్లీప్‌లెస్‌నెస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. WHO ప్రకారం, 70% మానసిక సమస్యలు చివరికి ఫిజికల్ డిసీజ్‌లకు దారితీస్తాయి.

4. ఆర్థిక -వృత్తిపరమైన నష్టం: ప్రొడక్టివిటీ తగ్గి, జాబ్ మారాల్సి వస్తుంది. అమెరికాలో మానసిక ఒత్తిడి వల్ల సంవత్సరానికి $300 బిలియన్‌లు నష్టం వస్తుండగా, భారతదేశంలో 2024లో 15% ఉద్యోగులు స్ట్రెస్ కారణంగా జాబ్‌లు మారుతున్నారు.

5. రిలేషన్‌షిప్ డ్రామా: బౌండరీస్ లేకపోతే మానిప్యులేటివ్ వ్యక్తుల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. అలాగే, మన వ్యక్తిగత భావాలు సులభంగా బయటకు వచ్చే ముప్పు, సున్నితంగా మారడం, ఇన్‌సెక్యూరిటీలు పెరుగుతుంది.

మైండ్‌కు పాస్‌వర్డ్ సెటప్: 5 సూపర్‌-సింపుల్ స్టెప్స్

మీ మైండ్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడానికి, ఈ ఐదు సులభ దశలు పాటించండి:

1.మైండ్ లాక్: రోజూ కనీసం 10 నిమిషాలు కళ్లు మూసుకుని, మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మైండ్‌ను 'లాక్ మోడ్'లోకి పంపి, స్ట్రెస్‌ను 40% తగ్గిస్తుంది. మైండ్‌ఫుల్ హెల్త్ సొల్యూషన్స్ చెబుతోంది. ట్రై చేయండి: ఉదయం కాఫీ తాగుతూ, "నేను స్ట్రాంగ్, పాజిటివ్!" అని మీ మనసులో అనుకోండి.

2. ఆలోచనల ఫిల్టర్: నెగటివ్ థాట్ రాగానే, వెంటనే "హోల్డ్ ఆన్!" లేదా "స్టాప్!" అని చెప్పి, ఆ ఆలోచన నిజామా కాదా అని ఎవిడెన్స్‌తో చాలెంజ్ చేయండి. హెల్త్‌లైన్ ప్రకారం, ఈ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ నెగటివ్ ప్యాటర్న్స్‌ను బ్రేక్ చేస్తుంది. ఉదాహరణ: "నేను ఏమీ చేయలేను" అనుకుంటే, "గతంలో నేను ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేశాను" అని పాజిటివ్‌తో రీప్లేస్ చేయండి.

3. బౌండరీ బిల్డర్ : బయట నుంచి వచ్చే వాటి ప్రభావాన్ని తగ్గించండి. సోషల్ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిమిషాలు లేదా 1 గంటకు మాత్రమే పరిమితం చేయండి. నెగటివ్ గ్రూప్‌లు లేదా వ్యక్తులను మ్యూట్ చేయడం ద్వారా మీ మైండ్‌ను క్లీన్ స్పేస్‌గా ఉంచుకోవాలి. మీరు "ఇంతవరకే బయటకి" అని 'సైకలాజికల్ బౌండరీ' గీయాలి.

4. ఎమోషనల్ ఎడిటింగ్: మీ వ్యక్తిగత బాధలు, గోల్స్ లేదా సీక్రెట్‌లను ఎవరికైనా చెప్పే ముందు మూడుసార్లు ఆలోచించండి: వారు నమ్మదగినవారేనా ?. ఆ విషయం బయటకు వెళితే మీ కుటుంబానికి లేదా కెరీర్‌కు హాని చేస్తుందా అని ‘మెంటల్ గేట్‌వే’లో చెక్ చేయండి.

5. ప్రో హెల్ప్: రోజూ 5 నిమిషాలు డైరీలో రాసుకోండి: "ఈ రోజు నెగటివ్ ఏమిటి? పాజిటివ్ రీప్లేస్ ఏమిటి?". ఈ సెల్ఫ్-రిఫ్లెక్షన్ టెక్నిక్ నెగటివ్ ఆలోచనలను గుర్తించి, వైరస్‌లను డిలీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అవసరమైతే, హెడ్‌స్పేస్, కాల్మ్ వంటి మెడిటేషన్ యాప్‌లు లేదా CBT థెరపీ ద్వారా నిపుణుల సహాయం తీసుకోండి.

మీ మైండే మీ అతి పెద్ద ఆస్తి

కరోనా తర్వాత మానసిక సమస్యలు 25% పెరిగాయి. ఈ వేగవంతమైన ప్రపంచంలో, మీ మైండ్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇక లగ్జరీ కాదు, అది అత్యవసరం. "మైండ్ మీకున్న అతి పెద్ద ఆస్తి. దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే, మీ జీవితం హ్యాక్ అవుతుంది". మీ మైండ్ సురక్షితంగా ఉంటేనే, మీ జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది..