శరీరం ఆరోగ్యంగా ఉంటేనే లైంగిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఆ ప్రభావం లైంగిక జీవితంపై పడుతుంది. అలాగే పొట్టలో సమస్యలు ఉన్నా సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. అతిగా తినడం, మలబద్ధకం, అజీర్తి, కడుపునొప్పి... ఇవన్నీ కూడా మీ లైంగిక జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్యలు మీలో లైంగిక జీవితం పై ఆసక్తిని తగ్గించేస్తాయి. పొట్టలో గట్ మైక్రోబయోమ్ అనే మంచి బ్యాక్టీరియా జీవిస్తుందని అందరికీ తెలిసిందే. ఇవి పేగులలో ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని అలాగే లైంగిక ప్రవర్తనలో మార్పులు తెస్తాయి.
ఈ సమస్యలు ఉంటే...
కొన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్ట సమస్యలతో బాధపడే వారికి లైంగిక జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. పురుషుల్లో ఇవి చాలా సమస్యలను కలుగజేస్తాయి. అవి ఏమిటంటే...
1. ఇరిటబుల్ ఓవల్ సిండ్రోమ్
2. ఇన్ఫ్లషన్ ఓవల్ సిండ్రోమ్
3. మైక్రోస్కోపిక్ కోలిటిస్
4. అల్సరేటివ్ కోలిటిస్
5.సెలియాక్ డిసీజ్
6. క్రోన్స్ వ్యాధి
పైన చెప్పిన సమస్యలు ఉన్న వారిలో మలబద్ధకం, అతిసారం, వికారం, వాంతులు కావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, తీవ్ర అలసట, కడుపునొప్పి వంటి సమస్యలను కలుగజేస్తాయి. ఈ సమస్యల వల్ల లైంగిక ఆసక్తి పూర్తిగా పోతుంది.
ఎలా ప్రభావితం?
వైద్యులు గట్ బ్యాక్టీరియా అంటే పొట్టలోని మంచి బ్యాక్టీరియా సరిగా లేకపోతే... ఇవి లైంగిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు.
మూడ్
అధ్యయనాల ప్రకారం శరీరంలో హ్యాపీ హార్మోన్ అయినా సెరటోనిన్ 95% కంటే ఎక్కువ పేగులలోనే ఉత్పత్తి అవుతుంది. ఇది మంచి మొత్తంలో ఉత్పత్తి అవ్వాలంటే పొట్ట ఆరోగ్యంగా ఉండాలి. సెరోటోనిన్ ఉత్పత్తి అయితేనే లైంగికంగా ఆసక్తి పెరుగుతుంది, లేకుంటే తగ్గిపోతుంది.
శక్తి
పొట్టలోని బ్యాక్టీరియా శక్తి కోసం బి విటమిన్లను సృష్టిస్తాయి. ఆ బ్యాక్టిరియా ఆరోగ్యంగా లేకపోతే బి విటమిన్లను ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల శరీరం తీవ్రంగా అలసిపోయినట్టు అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. ఇలాంటప్పుడు లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది.
ఇన్ఫ్లమేషన్
పొట్టలో మంచి బ్యాక్టీరియాలు ఆరోగ్యకరంగా లేకపోతే లైంగిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇవి శరీరంలో వాపుకు దారి తీయవచ్చు.
అంటువ్యాధులు
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా లైంగిక జీవితం పై ఆసక్తి పోతుంది. ‘ఇ. కోలి’ అనే బ్యాక్టీరియా మూత్రనాళం ద్వారా పేగులోకి ప్రవేశించి అంటువ్యాధులకు కారణం అవుతుంది. దీనివల్ల మంచి బ్యాక్టిరియా ప్రభావితం అవుతుంది.
ఒత్తిడి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణాశయాంతర సమస్యలకు, ఒత్తిడికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇది గర్భం ధరించే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఒత్తిడి కలిగితే కార్టిసోల్ వంటి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి సెక్స్ పై ఆసక్తిని తగ్గించేస్తాయి.
Also read: ఈ బొమ్మలో మీకు ఏ జీవి మొదట కనిపిస్తుందో చెప్పండి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.