రోజురోజుకి పెరుగుతోన్న కరోనా కేసులు తాజాగా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. 69,959 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 2.29%గా ఉంది. రికవరీ రేటు 96.36%గా ఉంది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. కొత్తగా 33,470 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 69,53,514కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,647కు చేరింది.
మహారాష్ట్రలో కొత్తగా 31 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,247కు పెరిగింది. కొత్తగా నమోదైన 31 కేసుల్లో 28 పుణె నగరంలోనే వెలుగుచూశాయి.
తమిళనాడు..
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య ఆదివారం కంటే మరో 1000 పెరిగింది. ఒక్కరోజులో 13,990 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 36,866కు చేరింది.
చెన్నైలో కొత్తగా 6,190 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చెంగల్‌పట్టు (16,96), తిరువల్లూర్ (1,054)లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు.
దిల్లీ..
దిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం పడకల సంఖ్య పెంచింది.