Government Issues Advisory on Cough Syrups: దగ్గుమందు వాడకం విషయంలో కేంద్రం  సూచనలు జారీ చేసింది.  మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో  దగ్గు మందువాడకంతో సంబంధం కలిగి 12 మంది పిల్లల మరణాలు సంభవించాయి. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం   రాష్ట్రాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రకారం, 2 ఏళ్ల లోపు పిల్లలకు  దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదు. 

Continues below advertisement

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగిన మరణాలు కేసన్స్ ఫార్మా కంపెనీ తయారు చేసిన 'కోల్డ్రిఫ్' కోల్ సిరప్‌తో జరిగాయని అంచనాకు వచ్చారు.   రాజస్థాన్ ప్రభుత్వం ఆ కంపెనీకి చెందిన 19 మందుల సరఫరాను ఆపేసింది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్ చేసి, పూర్తి దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం 'కోల్డ్రిఫ్' సిరప్‌పై పూర్తి నిషేధం విధించి, మార్కెట్‌లో ఉన్నవాటిని ఉపసంహరించేందుకు ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం మాత్రం దగ్గు మందు పరీక్షల్లో కిడ్నీ గాయాలకు కారణమైన   కంటామినెంట్స్  దొరకలేదని చెప్పినప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం చేసిన పరీక్షల్లో ఈ సిరప్‌లో వీటిని గుర్తించారు.  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో ఏడుగురు పిల్లలు, రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయపూర్‌లో ఐదుగురు పిల్లలు దగ్గు మందు సిరప్  తాగిన తర్వాత మరణించారు.   ఈ పిల్లలు 2 నుండి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు. జలుబు, దగ్గు లక్షణాలతో డాక్టర్లు రాసిన సిరప్ తాగిన తర్వాత వారు కిడ్నీ ఫెయిల్యూర్, శ్వాసకోశ సమస్యలతో బాధపడి మరణించారు.   

కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) జారీ చేసిన హెచ్చరికలో, పిల్లల్లో దగ్గు, జలుబు లక్షణాలకు మొదటి చికిత్సగా "తగినంత హైడ్రేషన్ ,విశ్రాంతి"ని సూచించారు. 2 ఏళ్ల లోపు పిల్లలకు యాంటీట్యూసివ్స్ , ఎక్స్పెక్టోరెంట్స్  , యాంటీహిస్టమైన్స్, డీకంజెస్టెంట్స్ వంటి మందులు ఇవ్వొద్దని సూచించారు.   డాక్టర్లు, ఫార్మసీలు ఈ మందులు అమ్మకానికి ముందు ప్రిస్కిప్షన్  తప్పనిసరి అని హెచ్చరించారు. "పిల్లల్లో మందుల వాడకం జాగ్రత్తగా ఉండాలి. అనవసర మందులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి" అని వైద్య  నిపుణులు చెబుతున్నారు. 

Continues below advertisement

రాజస్థాన్ ప్రభుత్వం డ్రగ్ కంట్రోలర్ రాజీవ్ ప్రతాప్ సింగ్‌ను సస్పెండ్ చేసింది. కేసన్స్ ఫార్మా కంపెనీపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది. తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 'కోల్డ్రిఫ్' సిరప్‌లో కల్తీ పదార్థాలు గుర్తించి, మార్కెట్‌లో ఉన్నవాటిని రికాల్ చేయాలని ఆదేశించింది.  కేంద్రం అన్ని రాష్ట్రాలకు మందుల సాంపిల్స్ పరీక్షించి రిపోర్ట్ సమర్పించాలని సూచించింది.