Patanjali: పతంజలి ఇయర్ గ్రిట్ గోల్డ్- మెంతులు, వేప, భృంగరాజ్ మూలికలతో మీ వినికిడి శక్తిని పెంపొందించుకోండి !
Patanjali EarGrit: వినడానికి, శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి చెవులు చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది చెవి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 700 మిలియన్లకు చేరుకోవచ్చు.

Ear Health Guide:
చెవులు మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. వినికిడితో పాటు శరీరం సమతుల్యతను కాపాడుకోవడంలో చెవి సహాయపడుతుంది. చిన్న పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు వారి శరీర సమతుల్యతను కాపాడేది మన చెవులే. చెవి లోపల ఒక ద్రవంలో తేలియాడే కొన్ని చిన్న కణాలు ఉంటాయి. ఈ కణాల కదలికలే మన సమతుల్యతను నియంత్రిస్తాయి.
చెవి మూడు భాగాలుగా విభజించబడింది. మొదటిది బయటి చెవి, మనం బయటి నుండి చూసే భాగం. ఇది చెవి కాలువ ద్వారా కర్ణభేరికి అనుసంధానించబడి ఉంటుంది. రెండో భాగం మధ్య చెవి, ఇది పెట్టె ఆకారంలో ఉండి శరీరంలోని మూడు చిన్న ఎముకలను కలిగి ఉంటుంది. మధ్య చెవి యూస్టాచియన్ ట్యూబ్ ద్వారా గొంతు వెనుక భాగానికి అనుసంధానమై ఉంటుంది.
అన్నిటికంటే లోపలి భాగాన్ని లోపలి చెవి అంటారు. ఇది నత్త ఆకారంలో ఉండి శబ్దాలను వినడానికి సహాయపడుతుంది. ఈ నత్త లాంటి నిర్మాణం ఒక రకమైన ద్రవంతో నిండి ఉంటుంది. ఇది కంపనాల రూపంలో వచ్చే తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపడంలో తోడ్పడుతుంది.
వినికిడి సామర్థ్యం - చెవి సమస్యలు
ప్రపంచంలో సుమారు 5 శాతం మంది ఏదో ఒక రకమైన చెవి సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో 432 మిలియన్ల మంది పెద్దలు, 34 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, 2050 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 700 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే ప్రతి 10 మందిలో ఒకరు చెవి సమస్యతో బాధపడతారు. ఒక వ్యక్తికి వినికిడి లోపం ఉందని ఎలా నిర్ధారిస్తారు? దీని కోసం ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ (PTA) లేదా డెసిబెల్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తారు.
శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. మానవుల వినికిడి సామర్థ్యం 0 డీబీ (డెసిబెల్స్) నుండి 130 డీబీ వరకు ఉంటుంది. ఎవరైనా 0 డీబీ వద్ద వచ్చే అతి చిన్న శబ్దాన్ని కూడా వినగలరు. 85 డీబీ వరకు శబ్దాలు సురక్షితమైనవిగా పరిగణిస్తారు. అయితే 120 డీబీ కంటే ఎక్కువ శబ్దాలు వ్యక్తిపై వెంటనే ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తి 35 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాలను వినడానికి ఇబ్బంది పడుతుంటే, వారి వినికిడి శక్తి తగ్గినట్లుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 25 శాతం మందిలో ఈ రకమైన సమస్య కనిపిస్తోంది.
ఇయర్‌ఫోన్లు - చెవి సమస్యలు
ప్రస్తుతం అన్ని వయసుల వారు వాడుతున్న ఇయర్‌ఫోన్లు చెవి సమస్యలను పెంచుతున్నాయి. వీటిని ఎక్కువసేపు వాడటం వల్ల చెవి లోపలికి తగినంత గాలి చేరదు. దీనివల్ల చెవి లోపలి ఉపరితలంపై అనేక రకాల బాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. కర్ణభేరి దెబ్బతినడం, చెవిలో గుబిలి ఎక్కువగా పేరుకుపోవడం, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా బయటి వస్తువులు చిక్కుకోవడం వినికిడి లోపానికి ప్రధాన కారణాలు. వయసు పెరగడం, పేలుడు శబ్దాలకు గురికావడం, చెవిలో గడ్డలు లేదా మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ నివారణలో వాడే మందుల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది.
ఆయుర్వేదం ప్రకారం చెవిలో నూనె వేయడంపై పరిమితులు
చెవి సమస్యల కోసం ఆయుర్వేదంలో వాడే నూనె తక్కువ ఉష్ణోగ్రతలు లేదా చల్లని వాతావరణంలో గడ్డకడుతుందని అలోపతి నిపుణులు భావిస్తారు. దీనివల్ల వ్యాధి తగ్గడానికి బదులు పెరుగుతుందని, ఆయుర్వేద వైద్య విధానం చెవి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం కాదని వారు అభిప్రాయపడతారు.
గ్లిజరిన్‌తో తయారైన ఆయుర్వేద ఔషధం
ఈ సమస్య పరిష్కారానికి పతంజలి ఇయర్ గ్రిట్ ఇయర్ డ్రాప్స్ అభివృద్ధి చేసింది. ఈ మందును మెంతులు, వేప, ఉమ్మెత్త, తులసి, భృంగరాజ్, ఉత్తరేణి, పసుపు, సుదర్శన్ వంటి మూలికలతో తయారు చేశారు. ఈ మందు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో నూనెకు బదులుగా గ్లిజరిన్ ఉపయోగించారు. ఆయుర్వేద చరిత్రలో నూనెకు బదులు గ్లిజరిన్‌తో ఆయుర్వేద మందులను ప్రాసెస్ చేయడం ఇదే మొదటిసారి.
దీనితో పాటు ఇయర్ గ్రిట్ గోల్డ్ టాబ్లెట్స్ అనే మందును కూడా తయారు చేశారు. ఇందులో శ్వేత సారివ, అతిమధురం, కుత, దాల్చినచెక్క, చిన్న యాలకులు, తేజపత్తా, నాగకేసరి, ఫుల్ప్రియంగు, నీలోత్పల్, గిలోయ్, లవంగాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరి, భృంగరాజ్, మకోయ్, గురివింద, అర్జున, యవ, పసుపు, వేప, వావిలి ఆకు వంటి మూలికలతో పాటు అభ్రక భస్మం, లోహ భస్మం, శిలాజిత్, రసరాజ్ రస్ ఉన్నాయి. ఈ మందులన్నీ చెవి వ్యాధులను నయం చేయడంలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.























