తెలంగాణలో కరోనా పరిస్థితులు..  ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇంతే ఉంటే  నెలాఖరు కల్లా  తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ లేదా పాక్షిక కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుందని హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు.  ప్రస్తుతం తెలంగాణలో  ఒమిక్రాన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే కరోనా కేసులు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్న కారణంగా ... డీహెచ్ ఈ విశ్లేషణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ రోజుకు పది కేసుల చొప్పున పెరుగుతున్నాయి. ఇప్పటికి 80కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా కేసులు రెండు వందలకుపైగా నమోదవుతున్నాయి. 


Also Read: పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...


సాధారణంగా అయితే ఈ కేసుల సంఖ్య తక్కువే. కానీ.. వ్యాప్తి అత్యంతప్రమాదకరంగా మారుతున్న సమయంలో  ... కేసులు పెరగడాన్ని  వైద్య వర్గాలు డేంజర్‌గా అంచనా వేస్తున్నాయి. ప్రజలు పెద్దగా ఒమిక్రాన్ నిబంధనలు పట్టించుకోకపోవడం... ప్రభుత్వ ఆంక్షల్ని లెక్క చేయకపోవడం.. మాస్కుల్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాల వల్ల పరిస్థితి అదుపు తప్పుతుందని తెలంగాణ సర్కార్ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి విషయంలో నిపుణుల హెచ్చరికలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కారణంగా  కట్టడికి లాక్ డౌన్‌ తరహా ఆంక్షలు తప్పవన్న అభిప్రాయాన్ని ఇప్పటికే నిపుణులు వ్యక్తం చేశారు. 


Also Read: అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?


ఈ క్రమంలో  డీహెచ్ శ్రీనివాసరావు నోట తలాక్ డౌన్ మాట రావడంతో మళ్లీ అలజడి ప్రారంభమవుతోంది. కరోనా తొలి విడత సమయంలోపూర్తి స్థాయి లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడ్డారు.  రెండో విడత సమయంలోనూలాక్ డౌన్ విధించారు. అయితే కొన్ని సడలింపులు ఉండటంతో ప్రజలు కాస్త తక్కువ ఇబ్బందులుపడ్డారు. వరుసగా మూడో విడతకు కూడా లాక్ డౌన్ వేస్తే...ప్రజలు మరింత ఇబ్బంది పడటం ఖాయం. అయితేప్రజలు పూర్తి స్థాయిలో ఒమిక్రాన్ నిబంధనలు పాటిస్తే కట్టిడి చేయవచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అంతా ప్రజల్లో చేతుల్లో ఉందంటున్నారు.


Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి