'యశోద' (Yashoda) కలెక్షన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. సమంత (Samantha) సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి... ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తీయడానికి మరికొంత మంది నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'యశోద'కు మంచి వసూళ్లు వస్తున్నాయి. 


మూడు రోజుల్లో నాలుగు కోట్లు
అమెరికా, ఆస్ట్రేలియాలో 'యశోద'కు ఆదరణ బావుంది. ముఖ్యంగా అమెరికాలో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 426156 డాలర్లు కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీలో సుమారు మూడున్నర కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో 53,590 డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే... 29 లక్షలు అన్నమాట. ఇంకా కెనడా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ కలెక్షన్స్ కలిపితే ఈజీగా నాలుగు కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లకు రెండు నెలల తర్వాత లాభాలు తీసుకు వచ్చిన సినిమా 'యశోద' అని టాక్. శనివారమే అమెరికా డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిసింది.  


కలెక్షన్స్ పెరుగుతున్నాయ్!
ఏపీ, తెలంగాణ, తమిళనాడు... ఇండియాలో రోజు రోజుకూ 'యశోద' కలెక్షన్స్‌లో గ్రోత్ ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. శుక్రవారంతో పోలిస్తే... శనివారం 30 శాతం ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయట. ఆదివారం 'యశోద' థియేటర్ల దగ్గర మరింత సందడి కనిపించిందని, హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టారని తెలిసింది. 


Also Read : 'ఆహ నా పెళ్ళంట', 'వండర్ వుమన్' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి


'యశోద' కోసం సమంత చాలా కష్టపడ్డారు. యాక్షన్ సీన్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. డూప్, రోప్స్ వాడలేదు. ప్రతి సీన్ సొంతంగా చేశారు. ట్రైనింగ్ తీసుకుని మరీ స్టంట్స్ చేశారు. జ్వరంలో కూడా సమంత యాక్షన్ అండ్ స్టంట్ సీన్స్  చేశారని దర్శకులు తెలిపారు. తనకు మయోసైటిస్ ఉన్నప్పటికీ... అడుగు తీసి వేయడం కష్టం అయినప్పటికీ... సెలైన్ బాటిల్ సహాయంతో డబ్బింగ్ చెప్పారు. ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం బాక్సాఫీస్ దగ్గర లభిస్తోంది. 


హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ 'యశోద'ను నిర్మించారు. గతంలో 'ఆదిత్య 369' వంటి న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమా తీసిన ఆయన, మరోసారి 'యశోద'తో కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఫ్యూచరిస్టిక్ ఐడియాస్‌తో సినిమాలు తీసే నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 


'యశోద' కథ కొత్తగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. సమంత నటనతో పాటు మణిశర్మ నేపథ్య సంగీతానికి... పులగం చిన్నారాయణ, డా చల్లా భాగ్యలక్ష్మి రాసిన మాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అశోక్ ఆర్ట్ వర్క్ కూడా ప్రశంసలు అందుకుంటోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.