What is Sitaare Zameen Par: ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా తర్వాత ఇంత వరకూ అమీర్ ఖాన్ మరో సినిమా చేయలేదు.కానీ ఆయన ఖాళీగా లేరు. సైలెంట్‌గా ఓ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా పేరు ‘సితారే జమీన్ పర్’. ఆమీర్‌ఖాన్ హీరోగా నటించి, నిర్మించారు. జెనీలియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తారే జమీన్ పర్‌కు సీక్వెల్‌గా సినిమా
ఆమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ 2007లో వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ తెరకెక్కింది. తారే జమీన్ పర్ సినిమా సినిమాలో ఓ బాలుడిలో స్ఫూర్తి నింపే పాత్ర చేశారు ఆమీర్‌ఖాన్ . అయితే ‘సితారే జమీన్ పర్’ లో ఆమీర్‌ఖాన్ పాత్రను పిల్లలే మోటివేట్ చేస్తారని, ఇదే ఈ సినిమా బేసిక్ స్టోరీ అనే టాక్ బాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే అమీర్ ఖాన్ మాత్రం ఈ స్టోరీ గురించి అసలు చెప్పనని అంటున్నారు. కనీసం వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సీక్వెల్ సినిమా నవ్విస్తుందా ?
2007లో వచ్చిన ‘‘తారే జమీన్ పర్’ ఎమోషనల్ మూవీ. చూసిన వాళ్లను ఏడిపించింది. కానీ ఇది ఎంటర్‌టైనర్ అని.. బాగా నవ్విస్తుందని చెబుతుననారు. తారే జమీన్ పర్ లో ఇషాన్ అనే ప్రత్యేకమైన పిల్లాడికి సాయం చేస్తారు అమీర్ ఇందులో ఇందులో అలాంటి తొమ్మిది మంది పిల్లలు ఆయనకు సాయం చేస్తారని చెబుతున్నారు. సితారే జమీన్ పర్‌లో దర్శిల్ సఫారీనే నటిస్తున్నారు. నిజానికి ఇది చాంపియన్స్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్‌గా చెబుతున్నారు.
సెన్సిబుల్ సినిమాలు తీసే అమీర్ ఖాన్
సెన్సిబుల్ సినిమాలు చేయడంలో అమీర్ ఖాన్ ముందు ఉంటారు. ఆయన చాలా సినిమాలు సమాజంలో చర్చనీయాంశం అవుతాయి. కమర్షియల్ సినిమాల్లోనే సమాజానికి కావాల్సిన అంశాలను చర్చిస్తూ ఉంటారు. త్రీ ఇడియట్స్ తో సహా అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. లాల్ సింగ్ చద్దా సినిమా ఓ రియల్ స్టోరీ.అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘెరంగా ఫెయిలయింది. దాంతో ఆయన కొత్త విరామం తీసుకుని మళ్లీ తనదైన మార్క్ సినిమాతో వస్తున్నారు.