Hanuman Viral Video: 'హనుమాన్' ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు 'హనుమాన్' ఒక సూపర్ హీరోగా తెలుసు. పెద్దలు దేవుడిగా కొలుస్తుంటారు. అలా థియేటర్‌లో పిల్లలు, పెద్దలు ఈ సినిమాని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది భక్తిభావంలోకి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా లాంగ్ షాట్‌లో పెద్ద.. హనుమాన్ విగ్రహం వచ్చినప్పుడు కొంతమంది చేతులెత్తి దండం పెడుతున్నారు థియేటర్‌లో. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవల్ అనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హనుమాన్ చాలీసా, హనుమాన్ నామస్మరణతో థియేటర్ మొత్తం మారుమోగిపోతోంది. ప్రేక్షకులను తన్మయత్వంలోకి లాకెళ్లిపోతోంది. అలా సినిమాలో ఇన్వాల్ అయిపోయిన ఒక మహిళ క్లైమాక్స్ సీన్ చూసి.. పూనకం వచ్చినట్లు ఊగిపోయింది.
థియేటర్‌లోనే పూనకం..
ప్రస్తుతం ట్విట్టర్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరు తెగ షేర్ చేస్తున్నారు. 'హనుమాన్' సినిమా చూసేందుకు ఒక మహిళ థియేటర్‌కి వచ్చింది. సినిమా మొత్తం ఆద్యంతం ఇన్వాల్వ్ అయి చూసిందో ఏమో.. క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఆమెకు పూనకం వచ్చినట్లు అయ్యింది. సీట్‌లో కూర్చున్న ఆమె ఒక్కసారిగా మెలికలు తిరగడం మొదలుపెట్టింది. ఆమెను ఆపడం ఎవ్వరివల్ల కాలేదు. కాగా.. ఇదంతా కొంతమంది షూట్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏషియన్ మాల్‌లో జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు. "భయ్యా ఏం తీశారు భయ్యా సినిమా. ప్రశాంత్‌వర్మ నువ్వు ఇది చూడాలి" అంటూ ట్విట్టర్‌లో ఆ పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
థియేటర్‌లో చూడాల్సి సినిమా..
నిజానికి 'హనుమాన్'పై పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. కానీ, రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్స్‌తో తెరకెక్కించాడు ప్రశాంత్‌వర్మ. ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా తీశారు. దీంతో మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ జరిగింది. చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమా చూస్తే కచ్చితంగా థియేటర్‌లోనే చూడాలని, ఆ విజువల్స్‌ని లార్జ్ స్క్రీన్ మీదే ఎక్స్‌పీరియెన్స్ చేయాలని చెప్పారు. దీంతో థియేటర్లకు క్యూ కట్టారు జనం. ముఖ్యంగా ఆంజనేయస్వామికి సంబంధించి ఒక పెద్ద విగ్రహం జనాలను తెగ ఆకట్టుకుంది. ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకునేందుకే మళ్లీ మళ్లీ సినిమాకి వెళ్లినవాళ్లు చాలామంది ఉన్నారు.
'జై హనుమాన్‌తో మరో మ్యాజిక్'
ఇక ఈ సినిమానే ఇలా ఉంటే.. జనాలకు పూనకాలు తెప్పిస్తుంటే 'జై హనుమాన్' ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక సీక్వెల్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇక సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్ హీరో అని చెప్పారు. మరి సకెండ్ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అందరిలో ఉత్కంఠ నెలకొంది. లిమిటెడ్ బడ్జెట్‌లో భారీ విజువల్ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచారు ప్రశాంత్ వర్మ. దీంతో ఇప్పుడు 'జై హనుమాన్' మీద ఇంతే భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ఇది ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.
Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!