Varun-Lavanya: టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల గురించి పరిచయం అవసరం లేదు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయారు. వీరి ప్రేమ, పెళ్లి గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు ఎట్టకేలకు ఈ జంట జూన్ 9 న నిశ్చితార్థం చేసుకున్నారు. వరుణ్ తేజ్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిందీ వేడుక. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వరుణ్-లావణ్యలు గతంలో పలు సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో వరుణ్-లావణ్య మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
గతంలో వరుణ్ తేజ్ - లావణ్య కలసి ‘మిస్టర్’ సినిమాలో నటించారు. ఆ సమయంలో మూవీ ప్రమోషన్ష్ లో భాగంగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు చెప్పారు. షూటింగ్ స్పాట్ లో మొదటి సారి ఒకర్ని ఒకరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగితే.. వరుణ్ ను చూసినపుడు పొడుగ్గా, అందంగా కనిపించాడని చెప్పింది లావణ్య. అలాగే తనకు లావణ్యను మొదటిసారి చూసినపుడు చాలా ఫన్నీగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేదని చెప్పాడు వరుణ్.
చిన్న వాటికి కూడా ఎక్కువ ఆలోచిస్తుంది : వరుణ్
సాధారణంగా లావణ్య చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు వరుణ్. షూటింగ్ టైమ్ లో కూడా యాక్టీవ్ గా కనిపిస్తూ ఉంటుందని అన్నాడు. అయితే ఒక్కోసారి ప్రతీ చిన్న దానికి కూడా ఓవర్ గా ఆలోచించేస్తుందని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా ఎక్కువ టెన్షన్ పడుతుందని చెప్పాడు. కానీ తాను అలా ఎక్కువగా ఆలోచించనని, పరిస్థితులు ఎలా ఉన్నా మామూలుగానే ఉంటానని అన్నాడు.
పక్కన ఉన్నా పట్టించుకోలేదు..
మొదట్లో షూటింగ్ స్పాట్ లు దగ్గర లావణ్య కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పేదని, అయితే ఒక్కోసారి కొంచెం దూరంగా ఉన్నప్పుడు తాను సైగ చేసినా, పక్క నుంచి వెళ్తూ హాయ్ చెప్పినా పట్టించుకునేది కాదని అన్నాడు వరుణ్. అయితే తనకు ఓ రోజు చిరాకొచ్చి ఆ విషయం అడిగేశానని అప్పుడు అసలు విషయం చెప్పిందని చెప్పాడు. లావణ్య కు కళ్లకు లెన్స్ ఉండేవని, అవి లేకపోతే దూరం నుంచి కనిపించేది కాదని చెప్పిందని చెప్పాడు.
కోస్టార్స్ ను ఎప్పుడూ అలా ఊహించుకోలేదు..
ఇదే ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో మీరు ఎప్పుడైనా కో స్టార్స్ తో అట్రాక్ట్ అయ్యారా అని అడిగితే.. ఇద్దరూ ఒకే ఆన్సర్ చెప్పారు. తాము షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు కేవలం డైలాగ్స్, యాక్టింగ్ మీదే దృష్టి పెడతామని చెప్పారు. షూటింగ్ సమయాల్లో అలా ఎప్పుడూ జరగలేదని, ఏ హీరోతో హీరోయిన్ తో గాని ఆ ఫీలింగ్ రాలేదని చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి ఓ నాలుగైదేళ్లు గడుస్తోంది. ఇప్పుడు వరుణ్-లావణ్య ప్రేమించుకొని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీంతో అప్పట్లో వరుణ్-లావణ్య అన్న మాటలు ఇప్పుడు ట్రెంట్ అవుతున్నాయి. దీని పై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు Vs రవితేజ - 2024 సంక్రాంతికి బిగ్ ఫైట్!