అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Movie). నవంబర్ 4న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
 
ఆహాలో డిసెంబర్ 9 నుంచి...
Urvasivo Rakshasivo On Aha OTT : 'ఊర్వశివో రాక్షసివో' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 'ఆహా' ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి సినిమా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. థియేటర్లలో విడుదల అయిన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.  


'ఊర్వశివో రాక్షసివో' సినిమాలో అల్లు శిరీష్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. ఇదొక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని ఆడియన్స్, క్రిటిక్స్ పేర్కొన్నారు. అమెరికాలో పెరిగి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడిన యువకుడు... సహ జీవనం స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కుటుంబం, ప్రేయసి మధ్య అతడు ఎలా నలిగిపోయాడు? ఏమయ్యాడు? అనేది సినిమా.






'ఊర్వశివో రాక్షసివో' సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ''ఈ తరానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. నేటి యువత‌రం, ప్రేమికులు ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను ఈ సినిమాలో చూపించాం'' అని చెప్పారు. 


అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీకి తోడు  'వెన్నెల' కిశోర్, సునీల్ కామెడీ ఆకట్టుకుంటుంది. శ్రీ కుమార్ పాత్రలో అల్లు శిరీష్, సింధు పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాలో సునీల్, 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర తారాగణం. కొత్తగా ఆఫీసులో చేరిన శ్రీకి సింధు పరిచయం అవుతుంది. లిఫ్టులో ముద్దుతో మొదలైన ప్రయాణం... బెడ్ వరకు వస్తుంది. అయితే... సింధుకు శ్రీ ఐ లవ్యూ చెబితే ''అలా చెప్పడం మానేయ్. మనం మంచి స్నేహితులం మాత్రమే అనుకుంటున్నాను'' అని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది ఆహాలో చూడండి.  


Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?
    
'ఊర్వశివో రాక్షసీవో' చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. తొలుత ఈ చిత్రానికి 'ప్రేమ కాదంట' టైటిల్ ఖరారు చేశారు. 'ఊర్వశివో రాక్షసీవో' అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని, టైటిల్ చేంజ్ చేశారు. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' తర్వాత GA2 పిక్చర్స్ సంస్థలో వస్తున్న చిత్రమిది. 


మూడేళ్ళ తర్వాత థియేటర్లలోకి వచ్చిన శిరీష్!
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఎబిసిడి' మే, 2019లో విడుదల అయ్యింది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమా రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి'లో అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్ళ తర్వాత మళ్ళీ  'ఊర్వశివో రాక్షసీవో'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.