Urfi Javed: ఉర్ఫీకి నీడ కరువు - ముంబైలో ఆమెకు ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదట!

సోషల్ మీడియా సంచనలం ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబైలో తనకు ఎవరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Continues below advertisement

బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వింత వింత డ్రెస్సులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె వేసుకునే బట్టలపై నిత్యం రగడ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు ఏమి అనుకున్నా నాకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తుంది. నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్లో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టుకుంది. ఇంతకీ తనకి వచ్చిన బాధేమిటంటే...

Continues below advertisement

ముంబైలో అద్దెకు ఇల్లు దొరకడం లేదు - ఉర్ఫీ

ఈ నటికి ముంబైలో ఉండటానికి ఇల్లే దొరకడం లేదట. అద్దె ఎక్కువిస్తానన్నా సరే ఎవరూ తనకు ఇల్లు ఇవ్వడం లేదట. ఇదే విషయాన్ని నెట్టింట్లో ప్రస్తావిస్తూ తన ఆవేదనంతా వెళ్లగక్కింది. ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్లో ఏం రాసిందంటే? “ముస్లిం యజమానులు నేను ధరించే దుస్తుల కారణంగా నాకు ఇల్లు రెంటుకు ఇవ్వరు. నేను ముస్లీంను కాబట్టి హిందువులు కూడా ఇల్లు ఇవ్వడం లేదు. అటు నాకు రాజకీయ బెదిరింపులు వచ్చిన కారణంగా చాలా మంది భయపడి ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. మొత్తంగా నాకు ముంబైలో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ఇంటి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు” అంటూ ట్వీట్ చేసింది.

ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇంతే!

అటు గతంలో కూడా ఉర్ఫీకి ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి ఉర్ఫీ రిప్లై ఇచ్చింది.  “ఒక్కసారి కాదు, ప్రతి సారి ఇదే పరిస్థితి ఎదురైంది. నటిని, అందులోనూ సింగిల్‌ ఉన్నాను. అందుకే నాలాంటి వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని తన బాధను వెల్లడించింది. 

ఉర్ఫీ జావేద్ ఎవరు?

బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌటి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.

ఉర్ఫీ జావేద్ వ్యక్తిగత జీవితం

ఉర్ఫీ జావేద్ అక్టోబర్ 15, 1997న లక్నోలో జన్మించింది. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌ లో పట్టా అందుకుంది. పరాస్ కల్నావత్‌ తో రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తోంది. 

Read Also: అందుకే నేను పూర్తిగా బట్టలేసుకోలేను - అసలు విషయం చెప్పిన ఉర్ఫీ జావెద్

Continues below advertisement
Sponsored Links by Taboola